NTV Telugu Site icon

Milk: పాలు తాగడం వల్ల ఊబకాయం పెరుగుతుందా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు

Milk

Milk

ప్రస్తుత కాలంలో చాలా మందిని కొవ్వు (కొలెస్ట్రాల్) సమస్య వేధిస్తోంది. దీని కారణంగా శరీర బరువు భారీగా పెరిగిపోతోంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు ఏం తినాలన్నా, తాగాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఏం తింటే ఏమవుతుందో అనే భయంతో కొన్ని ఆహార పదార్థాలను తినడం, తాగడం మానేస్తున్నారు. ఈ లిస్టులో మొదటి స్థానంలో వచ్చేది పాలు.

Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కావ్య

పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. అందుకే రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. పాలు తాగడం వల్ల బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. అంతే కాకుండా.. శరీరానికి కావాల్సిన అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు పాలలో నుంచి లభిస్తాయి. అయితే.. పాలు తాగితే బరువు పెరగడం కూడా ముడిపడి ఉంది. బరువు పెరుగుతుందనే భయంతో చాలా మంది పాలు తాగరు. అయితే పాలు తాగడం వల్ల ఊబకాయం పెరుగుతుందా..? అనే దానికి వివరాలు తెలుసుకుందాం… పాలలో పోషకాలతో పాటు, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో.. అధిక మొత్తంలో పాలు తాగడం వలన ఊబకాయానికి దారి తీస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ పెడితే.. పాలు తాగితే బరువు పెరిగే ప్రమాదాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు.

మూలిగే ‘పొట్టేల్’ పై శ్రీకాంత్ అయ్యంగార్ బాంబ్

పాలు తగ్గడం వలన బరువు తగ్గే సరైన మార్గం ఏమిటి..?
మీరు మీ బరువును నియంత్రించుకోవడానికి పాలు తాగేటప్పుడు కేలరీలను తగ్గించాలి. అందు కోసం.. ఎక్కువ పరిమాణంలో పాలు తాగడం మానుకోండి. అంతే కాకుండా.. పాలలో కేలరీల పరిమాణాన్ని తగ్గించడానికి, మొత్తం పాలకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి. అంటే.. పాల నుండి మీగడను పూర్తిగా తీసివేసి తాగండి. 1 గ్లాసు మొత్తం కొవ్వు పాలలో 146 కేలరీలు, కొవ్వు లేని పాలలో 86 కేలరీలు ఉంటాయి. ఈ క్రమంలో.. మీ అవసరాన్ని బట్టి సరైన పాలను తాగాలి. మీరు బరువు తగ్గించే డైట్‌లో ఉన్నట్లయితే.. మీ రోజువారీ కేలరీల కౌంట్‌ను దృష్టిలో ఉంచుకుని పాలను తీసుకోవాలి.

Show comments