Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dal Ki Dulhan: మే నెల ఎండలు మండిపోతున్న వేళ… కడుపుకు భారంగా కాకుండా, తిన్నాక కూడా తేలికగా అనిపించే ఆహారం కోసం చాలామంది వెతుకుతుంటారు. ప్రతిరోజూ అదే రొట్టె, అదే కూర, అదే పప్పు తింటూ బోర్ కొట్టేసినప్పుడు… ఒక్కసారి ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల సంప్రదాయ వంటకాల వైపు చూపు తిప్పితే అక్కడి గ్రామీణ వంటల్లో దాగి ఉన్న అసలైన రుచులు ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వంటకాల్లో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో, ఫుడ్ బ్లాగుల్లో వైరల్ అవుతున్న పేరు ‘దాల్ కీ దుల్హన్’. పేరు వినగానే ఆసక్తి కలిగించే ఈ వంటకం… అసలు చూస్తే పప్పులో మునిగిన చిన్న చిన్న పిండి ముద్దల కథ. కానీ రుచి మాత్రం ఒకసారి తింటే మళ్లీ మళ్లీ గుర్తొచ్చేలా ఉంటుంది.
బీహార్, ఉత్తరప్రదేశ్ గ్రామీణ కుటుంబాల్లో తరతరాలుగా వండుతున్న ఈ వంటకం అక్కడి సాంప్రదాయ ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘దాల్ పిఠా’, మరికొన్ని చోట్ల ‘దాల్ ధోక్లీ’ అని కూడా పిలుస్తారు. అయితే ‘దాల్ కీ దుల్హన్’ అనే పేరు మాత్రం ఈ వంటకానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. పప్పులో ఉడికే పిండి ముక్కలు చిన్న పెళ్లికూతురు లెహంగా ఆకారంలో కనిపించడంతో ఈ పేరు వచ్చిందని అక్కడి పెద్దలు చెబుతుంటారు. గ్రామీణ భారతీయ వంటల్లో పేర్ల వెనుక కూడా కథలు ఉంటాయనే విషయం ఈ డిష్ మరోసారి గుర్తు చేస్తుంది.
Also Read
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
ఈ వంటకం ప్రత్యేకత ఏంటంటే… చాలా తక్కువ నూనె, నెయ్యితో తయారవుతుంది. కందిపప్పు, గోధుమ పిండి ప్రధాన పదార్థాలు కావడంతో ఇది పోషకాహారంగా కూడా గుర్తింపు పొందింది. వేసవిలో జీర్ణక్రియ మందగించే సమయంలో భారమైన ఫ్రైలు, మసాలా కూరల కంటే ఇలాంటి తేలికపాటి వంటకాలు శరీరానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కందిపప్పులో ఉండే ప్రోటీన్ శరీరానికి బలం ఇస్తే, గోధుమపిండి తగిన కార్బోహైడ్రేట్లు అందిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో కూరగాయలు లేని సమయంలో కూడా ఈ ఒక్క వంటకం పూర్తి భోజనంలా సరిపోతుంది.
దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా కందిపప్పును పసుపు, ఉప్పుతో మెత్తగా కాకుండా కొద్దిగా పలుచగా ఉడికిస్తారు. మరోవైపు గోధుమపిండిలో వాము, ఉప్పు కలిపి ముద్దలా చేసి పెద్ద రొట్టెలా ఒత్తుతారు. తర్వాత చిన్న చిన్న గుండ్రని ముక్కలుగా కట్ చేసి, చేతులతో నాలుగు మూలలను కలిపి పువ్వు ఆకారంలో మలుస్తారు. ఈ చిన్న పిండి ముక్కలనే ఉడుకుతున్న పప్పులో వేసి మెల్లగా ఉడికిస్తారు. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలతో చేసిన తాలింపు వేసినప్పుడు మొత్తం వంటగది ఒక అద్భుతమైన వాసనతో నిండిపోతుంది.
బీహార్, యూపీల్లో ఈ వంటకాన్ని సాధారణంగా బంగాళదుంప చోఖా, వంకాయ భర్తా, పచ్చి మిర్చి చట్నీ, మామిడి ఊరగాయతో వడ్డిస్తారు. పైన ఒక చెంచా నెయ్యి వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. గ్రామీణ భారతదేశం ఎంత సరళమైన పదార్థాలతో కూడా అద్భుతమైన వంటకాలు సృష్టించగలదో ‘దాల్ కీ దుల్హన్’ మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ఈ సంప్రదాయ వంటకం మళ్లీ యువతలోకి వస్తుండటం విశేషం. బయట ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిన తరం కూడా ఇప్పుడు ఇలాంటి దేశీ వంటకాల వైపు తిరిగి చూస్తోంది. ఇక ఈ వంటకాన్ని తయారు చేసి మీ ఇంటిని పండుగ వాతావరణం చేసుకోవచ్చు కూడా.
తాజావార్తలు
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
-
Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
-
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
-
Aadhaar Update: జస్ట్ 5 నిమిషాల పని.. ఇంట్లో కూర్చుని మీ మొబైల్లోనే ఆధార్ అప్డెట్ చేసుకోండిలా..
-
Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!