NTV Telugu Site icon

Benefits of Spiny Gourd: బాబోయ్.. బోడ కాకరకాయ వల్ల ఇన్ని ఉపయోగాలా..!

Spiny Gourd

Spiny Gourd

Health: మన పెద్దలు చెప్తుంటారు సీజనల్ కాయలు పండ్లు కచ్చితంగా తినాలని. ఎందుకంటే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల సామర్ధ్యం సీజనల్ పండ్లకి మరియు కాయలకు ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది ఆకాకరకాయ. దీన్నే కొన్ని చోట్ల బోడ కాకరకాయ అని కూడా అంటారు. కేవలం వర్షా కాలంలో మాత్రమే దొరికే ఈ కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. మామూలు కాకరకాయతో పోల్చుకుంటే బోడ కాకరకాయ తక్కువ చేదు ఉంటుంది. కొన్ని అసలు చేదు ఉండవు.

Read alsoBigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?

చూడడానికి ఆకుపచ్చ రంగులో పైన చిన్నచిన్న బుడిపెలతో ఉంటాయి. ఈ కాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. వీటిలో ఫొలేట్లు అధికంగ ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాలు వృద్ధి తోడ్పడతాయి. గర్భవతులు ఇవి తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. అలానే రక్తంలో చక్కర స్థాయిని తగ్గించి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో సాధారణంగా వ్యాప్తి చెందే జలుబు, దగ్గు మొదలైన అలెర్జీ సమస్యలను దూరం చేస్తాయి . ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ బోడ కాకరకాయలు ఎక్కువగా అడవుల్లో మరియు గ్రామాల్లో విరివిగా లభిస్తాయి. పట్టణాలలో ఉండే వాళ్ళకి ఇవి మార్కెట్ లో లభిస్తాయి.