NTV Telugu Site icon

Benefits of Ragi idli : రాగి ఇడ్లీ ఉపయోగాలు.. తయారీ విధానం

Untitled 4

Untitled 4

Health:రాగులు ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక రాగులు అధిక బరువుని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అలానే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృధాప్య సమస్యలు దరిచేరవు. జట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న రాగులతో రకరకాల ఆహారపదార్ధాలను తాయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం రాగి ఇడ్లీ ఎలా తయారు చెయ్యాలి..? అలానే కావాల్సిన పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Broccoli Benefits: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఇది తినండి

రాగి ఇడ్లి తయారీకి కావాల్సిన పదార్ధాలు:
రాగులు- 1 కప్పు
మినపప్పు- 1 కప్పు
ఉప్పు- రుచికి తగినంత.
తయారీ విధానం:
ముందుగా రాగుల్ని తీసుకుని బాగా కడగాలి. ఇప్పుడు ఆ రాగుల్లో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలానే మినపప్పుని కూడా కడిగి మరో గిన్నెలోకి తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రాగుల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలోనే నానబెట్టుకున్న మినపప్పుని వేసి మరో సారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నెయ్యి రాసుకున్న ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకుని ఆవరిపైన 20 నిముషాలు మీడియం ఫ్లేమ్ లో ఉండికించుకొవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ తాయారు అయినట్లే.. కాస్త చల్లారాక ఇడ్లీని ప్లేట్ నుండి తీసుకుంటే విరిగిపోకుండా వస్తాయి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.