స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. స్వీట్స్ లలో బాదుషా కూడా ఒకటి..బాదుషా లోపల మెత్తగా పైన క్రిస్పీగా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అయితే ఈ బాదుషాను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మందికి రాదు.. ఎన్ని సార్లు చేసిన కూడా ఏదోకటి తప్పు అవ్వడంతో చెడిపోతుంది.. ఇప్పుడు సింపుల్ గా పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
మైదాపిండి – 2 కప్పులు,
ఉప్పు – చిటికెడు,
బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్,
కరిగించిన నెయ్యి – అర కప్పు,
నీళ్లు – అర కప్పు,
పంచదార – 2 కప్పులు,
కుంకుమ పువ్వు – చిటికెడు,
యాలకుల పొడి – అర టీ స్పూన్,
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా…
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకొని ఉప్పు, సోడా ఉప్పు వేసి బాగా కలపాలి..తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని చేత్తో వత్తుతూ మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు వేసి కలపాలి…చిన్న మంట మీద లేత పాకం వచ్చేవరకు చూడాలి..పంచదార పాకం సిద్దంకాగానే యాలకుల పొడి వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని బాగా కలుపుకోవాలి..బాదుషా ఆకారంలో వత్తుకోవాలి. తరువాత బొటన వేలుతో రంధ్రం చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక తగినన్ని బాదుషాలను వేసుకోవాలి. కొద్ది సమయానికి బాదుషాలు పైకి తేలుతాయి. ఇలా బాదుషాలు పైకి తేలగానే మంటను సిమ్ లో పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి.. ఇక వాటిని పంచదార పాకంలో వేసుకోవాలి..కొద్దిసేపు నానిన తర్వాత తీసుకొని తింటే సరి బాదుషా రెడీ.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..