Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Standing Exercises: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. పెరుగుతున్న పొట్ట కొవ్వు చాలా మందిలో ఆత్మన్యూనతాభావాన్ని కలిగిస్తుంది. ఇకపై బెల్లీకి బాయ్ బాయ్ చెప్పడానికి గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన పనిలేదు, మీ ఇంట్లోనే నిలబడి చేసే కొన్ని సింపుల్ వ్యాయామాలతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పొట్ట తగ్గించుకోవాలంటే కేవలం నేలపై పడుకుని చేసే వ్యాయామాలే చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ నిలబడి చేసే ‘స్టాండింగ్ వర్కౌట్స్’ కోర్ కండరాలపై పడటమే కాకుండా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తాయని వివరించారు. పొట్ట చూట్టూ పెరుకుపోయిన కొవ్వును సింపుల్‌గా కరిగించే ఆ 6 ప్రభావవంతమైన వ్యాయామాల గురించి ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: AP Weather Alert: ఏపీలో భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాల్పులు..
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
1. స్టాండింగ్ నీ-టు-ఎల్బో (Knee-to-Elbow)
ఇది పొట్ట ముందు భాగం – పక్కల కొవ్వుపై పనిచేస్తుంది. నిటారుగా నిలబడి చేతులను తల వెనుక ఉంచాలి. కుడి మోకాలిని పైకి లేపుతూ ఎడమ మోచేతికి తాకించాలి. ఇలా మార్చి మార్చి చేయడం వల్ల పొత్తికడుపుపై ఒత్తిడి పడి కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. స్టాండింగ్ ఆబ్లిక్ క్రంచ్ (Oblique Crunch)
నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును (Love Handles) కరిగించడానికి ఇది బెస్ట్ వర్కౌట్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగా కాళ్లను పక్కకు ఎత్తుతూ అదే వైపు ఉన్న మోచేతికి తాకించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుందన్నారు.
3. హై నీస్ (High Knees)
ఒకే చోట నిలబడి మోకాళ్లను ఛాతీ వరకు పైకి లేపుతూ వేగంగా పరుగెత్తాలి. ఇది ఒక కార్డియో వ్యాయామంలా పనిచేసి శరీరంలోని మెటబాలిజంను పెంచుతుందన్నారు.
4. స్టాండింగ్ రష్యన్ ట్విస్ట్ (Russian Twist)
కాళ్లు కదపకుండా కేవలం నడుము పైభాగాన్ని మాత్రమే కుడి, ఎడమ వైపులకు వేగంగా తిప్పాలి. ఇది పొత్తికడుపు కండరాలను దృఢంగా మార్చడమే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెప్పారు.
5. జంపింగ్ జాక్స్ (Jumping Jacks)
జంపింగ్ జాక్స్ వర్కౌట్‌లో భాగంగా చేతులు, కాళ్లు ఒకేసారి కదిలిస్తూ గెంతడం వల్ల హార్ట్ రేట్ పెరిగి కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.
6. ఉడ్ చాప్ (Wood Chop)
గొడ్డలితో చెక్కను నరుకుతున్నట్లుగా చేతులను పైనుంచి కిందికి బలంగా కదపాలి. ఇది మొత్తం పొట్ట భాగంలోని కండరాలను కదిలిస్తుందని , దీని ద్వారా ఫ్యాట్ కరుగుతుందన్నారు.
పైన పేర్కొన్న ఆరు వ్యాయామాలను ఒకదాని తర్వాత ఒకటి విరామం లేకుండా చేయాలన్నారు. ప్రతి వ్యాయామాన్ని కనీసం 30 సెకన్ల పాటు చేయాలని, ఒక సెట్ పూర్తయ్యాక 60 నుంచి 90 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెప్పారు. ఇలా రోజుకు 3 నుంచి 4 సెట్లు చేస్తే 25-30 నిమిషాల్లో వర్కౌట్ పూర్తవుతుందన్నారు. మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కేవలం ఈ వర్కౌట్ మాత్రమే సరిపోదని, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే 70% డైట్, 30% వర్కౌట్ సూత్రాన్ని పాటించాలన్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, షుగర్ ఐటమ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా మీరు కోరుకున్న ఫిట్‌నెస్‌ను పొందవచ్చన్నారు.
READ ALSO: April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!