NTV Telugu Site icon

Hair Care: మీ జుట్టు బలంగా మారాంటే ఇవి తినండి..

White Hair

White Hair

ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల శాంపులు, నూనెలు వాడుతుంటాం. కానీ.. కొన్ని విస్తనాలు తినడం వల్ల కూడా జుట్టు బలంగా ఉంటుంది. ఆ సీడ్స్ ఎంటో ఇప్పుడు చూద్దా.. జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, సెలీనియం వంటి న్యూట్రియెంట్స్ స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి.

READ MORE: YS Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు

చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాల్లో ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కురుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వుల్లోని విటమిన్-ఇ, స్కాల్ప్‌‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నువ్వుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలను తగ్గించగలవు. జుట్టు చివర్లు చిట్లిపోకుండా రక్షిస్తాయి. జనపనార విత్తనాల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

READ MORE: Kolkata doctor case: మీడియాను చూసి పరుగులు పెట్టిన నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడు

అవిసె గింజలు తింటే స్కాల్ప్(తలచర్మం) ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వంటివి జుట్టు, స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ యాసిడ్స్ అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ప్రోటీన్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యంలో కీలకంగా పనిచేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇన్‌ఫ్లషన్‌ను తగ్గిస్తాయి.