NTV Telugu Site icon

Health Tips : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా?

Rice

Rice

ఈరోజుల్లో ఎక్కువగా అన్నాన్ని తినడం లేదు.. ఎవరి నోటికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు చేసుకుంటున్నారు. లేదా బయట ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ను తింటున్నారు… అయితే కొందరు మూడు పూటల అన్నాన్ని చేసుకుంటారు.. అలా ఒక్కోసారి రాత్రి అన్నం మిగిలిపోతుంది.. ఆ అన్నాన్ని కొందరు ఉదయం కూడా తింటారు. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఉదయం లేవగానే చాలామంది తింటూ ఉంటారు.. అలా తినడం వల్ల ఏదైన ప్రమాదం ఉందా? అసలు నిపుణులు ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట మిగిలిన అన్నంలోకి ఉదయం అయ్యే సరికి బ్యాక్టీరియా చేరుతుంది రాత్రి నుంచి ఉదయం వరకు అంటే దాదాపు 10 గంటల పాటు అన్నం వండి వంటింటిలో అలానే ఉండిపోవటం మాత్రమే కాదు బయట వేడి కూడా ఎక్కువగా ఉండటం వల్ల అన్నంలోకి కొన్ని రకాల బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి.. ఆ అన్నాన్ని తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు..

ఆ అన్నాన్ని ఉదయం తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు పుడ్ ఫాయిజినింగ్ అవుతుందని చెబుతున్నారు.. అన్నం వండడగానే రెండు గంటల లోపు తినేయాలి. చాలామంది అన్నం వేడి చేసుకొని తింటుంటారు. అలా చేయకూడదు ఒకసారి అన్నం వండిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వండుకుని తింటే మంచిది ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.. ఈరోజుల్లో తినే ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.