Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- ఒంటరిగా భోజనం చేస్తే మానసిక, మెదడు ఆరోగ్యంపై ఎఫెక్ట్..
- పరిశోధకులు అధ్యయనంలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health: తరుచుగా మీరు ఒంటరిగా భోజనం చేస్తున్నారా.? అయితే మీరు మానసిక, మెదడు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. కలిసి భోజనం చేయడం కేవలం మనుషులను దగ్గర చేసే ఒక సామాజిక అలవాటు మాత్రమే కాదు, ఇది మన మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విషయమని పరిశోధకుల అధ్యయనం తేల్చింది. కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడం, సహోద్యోగులతో కలిసి తినడం, స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక సంబంధాలే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
కలిసి భోజనం చేయడం ద్వారా భావోద్వేగ ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒంటరిగా భోజనం చేయడం ద్వారా డిప్రెషన్‌తో పాటు మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. కలిసి భోజనం చేయడం ద్వారా మాట్లాడుకోవడం, పరస్పరం అనుబంధాలు పెంచుకోవడం, సంంధాలను బలోపేతం చేసుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం వంటి అవకాశాలు లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
కలిసి భోజనం చేయడవ వల్ల భావోద్వేగ ఆరోగ్యం మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సంబంధం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తరచుగా ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే ఒంటరిగా భోజనం చేసే వారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించింది. తమకు తెలిసిన వ్యక్తులతో ఎంత తరచుగా లంచ్ లేదా డిన్నర్ చేస్తారనే ప్రశ్నలను కూడా పరిశోధకులు ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.
ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. జపాన్ పరిశోధకులు 2025లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. క్రమం తప్పకుండా ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో వాల్యూమ్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, కాగ్నిటివ్ ఫంక్షన్‌కు సంబంధించిన హిప్పోకాంపస్, మీడియల్ టెంపోరల్ లోబ్ వంటి ప్రాంతాల్లో ఈ తేడాలు కనిపించాయి.అయితే ఈ తేడాలకు ఆహారపు అలవాట్లు కూడా కొంతవరకు కారణం కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
కలిసి భోజనం చేసినప్పుడు ఆహారం మరింత ఆనందంగా అనిపించడానికి జీవశాస్త్రపరమైన కారణం కూడా ఉండవచ్చు. భోజనం చేయడం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్ అనే వ్యవస్థ క్రియాశీలకం కావచ్చు. ఇది ఆనందం, సామాజిక అనుబంధంతో సంబంధం ఉన్న వ్యవస్థ. అందుకే భోజనం చేసే సమయంలో ఒంటరిగా కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!