Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- బయట జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో..
- గోధుమపిండితో ఇంట్లోనే సులభంగా కరకరలాడే హెల్తీ స్నాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Wheat Flour Snacks: సాయంత్రం టీ సమయానికి ఏమైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు, బయటి జంక్ ఫుడ్ కొనే బదులు ఇంట్లోనే ఉన్న గోధుమపిండితో ఆరోగ్యకరమైన స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ క్రిస్పీ చిప్స్ తయారుచేయడం చాలా తేలిక, అలాగే రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. వీటిని ఒక్కసారి ఎక్కువ మొత్తంలో చేసుకుని నిల్వ ఉంచుకుంటే.. వర్షం పడేటప్పుడైనా లేదా టీ టైమ్‌లోనైనా లేదా ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఈ కరకరలాడే గోధుమపిండి బిస్కెట్లను పర్ఫెక్ట్గా ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* గోధుమపిండి: 1/2 కేజీ (4 కప్పులు)
* వాము: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* నువ్వులు: 3 – 4 టేబుల్ స్పూన్లు
* కారం: 2 స్పూన్లు
* ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 2.5 స్పూన్లు)
* వేడి నూనె: 1/2 కప్పు
* నీళ్లు: కలుపుకోవడానికి సరిపడా (సుమారు 1.25 కప్పులు)
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తయారీ విధానం:
మొదటగా ఒక గిన్నెలో గోధుమపిండి, వాము, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అర కప్పు వేడి నూనె పోసి, గరిటెతో బాగా తిప్పాలి. నూనె చల్లారాక, పిండిని చేత్తో ఒత్తుతూ ముద్దలా అయ్యేలా 2-3 నిమిషాలు కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి (మెత్తగా ఉండకూడదు). అలా ఆ పిండిపై మూత పెట్టి అర గంట సేపు నాననివ్వాలి.
నానిన పిండిని 4 భాగాలుగా విభజించుకోవాలి. డ్రై అవ్వకుండా ఒక భాగం తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టాలి. తీసుకున్న పిండి ఉండకు పొడిపిండి అద్ది చపాతీలా ఒత్తుకున్నాక, లోపల పొరలు (లేయర్స్) రావడం కోసం నాలుగు వైపులా మడతబెట్టి (ఫోల్డ్ చేసి) మళ్లీ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చాకుతో మీకు నచ్చిన డైమండ్ లేదా స్క్వేర్ షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ముక్కలుగా తయారైన వాటిని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక, ఫ్లేమ్ ని సిమ్‌లో ఉంచి కట్ చేసుకున్న బిస్కెట్ ముక్కలను వేయాలి. వీటిని సన్న, మీడియం ఫ్లేమ్ మధ్య మాత్రమే వేయించాలి. పెద్ద మంటలో వేయిస్తే పైన రంగు వచ్చి లోపల మెత్తగా ఉండిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక నూనె వడకట్టి బయటకు తీయాలి. అంతే.. గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ రెడీ.! బాగా చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్లో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?