Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!

Stubborn Stains

Stubborn Stains

Remove Stubborn Stains: రోజువారీ జీవితంలో బట్టలు లేదా ఇతర వస్తువులపై పడే మొండి మరకలను తొలగించడం ఒక్కోసారి పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రకరకాల మరకలు, పేరుకుపోయిన మురికి పట్టినప్పుడు వాటిని ఎలా వదిలించాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయనాలు వాడకుండానే, వంటింట్లో సులభంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే ఈ సమస్యను చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..

బేకింగ్ సోడా

బట్టలపై మురికి లేదా మొండి మరకలు ఉన్న భాగంపై కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసి తేలికగా రుద్దాలి. ఆ తర్వాత దానిని బ్రష్‌తో కాస్త ఒత్తిడి పెట్టి రుద్దితే పేరుకుపోయిన మురికి వదులుతుంది. అవసరాన్ని బట్టి తగినంత నీటిని చిలకరించి బ్రష్ చేస్తే మరకలు చాలా వరకు తేలికగా తొలగిపోతాయి.

షాంపూతో రెట్టింపు ఫలితం

బేకింగ్ సోడాతో అలా చేసిన మరకలు ఇంకా మొండిగా ఉంటే.. ఆ భాగంపై కొద్దిగా షాంపూ వేసి మళ్లీ బ్రష్‌తో శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా, షాంపూ మిశ్రమం మరకలను లోతుగా శుభ్రం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకట్రెండు సార్లు రుద్ది నీటితో కడిగితే మొండి మరకలన్నీ మాయమై వస్తువు లేదా బట్టలు కొత్తదానిలా మెరుస్తుంది.

వినెగర్‌తో మరింత మెరుపు

మరింత మెరుగైన ఫలితం కోసం కొద్దిగా వెనిగర్ (Vinegar) జోడించి నాలుగైదు నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిలో బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే ఎలాంటి జిడ్డు లేదా నల్లటి మరకలైనా సులభంగా తొలగిపోతాయి. కరుడైన లాండ్రీ వాష్ లకు ఎక్కవుగా ఖర్చు చేయకుండా.. తక్కువ ఖర్చుతో ఇంటివద్దే పాటించగల ఈ సింపుల్ క్లీనింగ్ టిప్స్ ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడతాయి.