NTV Telugu Site icon

Easy and Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లన్నింటిలో దీని టేస్టే వేరయా

Easy And Healthy Breakfast

Easy And Healthy Breakfast

Easy and Healthy Breakfast: ఈజీ అండ్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్‌గ్రెడియెంట్స్‌(పదార్థాలు) ఏంటి? వాటిని ఏవిధంగా యూజ్‌ చేసుకోవాలి? అనే అంశాలను చూద్దాం.

ఈజీ అండ్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్‌ చేయాలంటే ముఖ్యంగా ఓట్స్‌, వాల్‌నట్స్‌, ఆల్మండ్స్‌(బాదం పప్పు), కోకో పౌడర్‌(కొబ్బరి పొడి), కాఫీ పౌడర్‌(కాఫీ పొడి), మిక్స్‌డ్‌ సీడ్స్‌(వివిధ రకాల విత్తనాలు) కావాలి. మిక్స్‌డ్‌ సీడ్స్‌, ఆల్మండ్స్‌, వాల్‌నట్స్‌.. ప్రొటీన్‌ లెవల్‌ పెరగటానికి ఉపయోగపడతాయి. కోకో పౌడర్‌, కాఫీ పౌడర్‌.. టేస్ట్‌ కోసం అవసరం. కాఫీ పౌడర్‌.. హార్ట్‌, బ్రెయిన్‌తోపాటు కొన్ని రకాల వ్యాధుల నియంత్రణకు మంచిది.

ఓట్స్‌ని ఒక గిన్నెలో తీసుకొని దానికి హాట్‌ వాటర్‌ కలపాలి. సరిపోయినంత వేడి నీళ్లు పోస్తే ఓట్స్‌ సాధ్యమైనంత త్వరగా ఒకటీ రెండు నిమిషాల్లోనే ఉడుకుతుంది. ఈ లోపు మిగిలిన ఇన్‌గ్రిడియెంట్స్‌ని(పదార్థాలని) యాడ్‌ చేసుకోవచ్చు. హాట్‌ వాటర్‌ని కలిపిన తర్వాత ఒక టేబుల్‌ స్పూన్‌ కోకో పౌడర్‌ని వేసి బాగా మిక్స్‌ చేయాలి. కోకో పౌడర్‌ ఓట్స్‌లో పూర్తిగా కలిసిపోయే వరకు స్పూన్‌తో తిప్పాలి. ఓట్స్‌, కోకో పౌడర్‌ మిక్స్‌ అయ్యాక ఆ మిశ్రమం లైట్‌ రెడ్‌ కలర్‌లోకి మారిపోతుంది.

తర్వాత.. ఒక టేబుల్‌ స్పూన్‌ కాఫీ పౌడర్‌ని వేసి దాన్ని కూడా బాగా కలపాలి. కోకో పౌడర్‌, కాఫీ పౌడర్‌ వేసిన అనంతరం ఓట్స్‌ మొత్తం చిక్కగా తయారవుతుంది. ఈ మిక్చర్‌ కొంచెం చేదుగా ఉంటుంది. అందువల్ల టేస్ట్‌ కొంచెం తియ్యగా మారాలనుకుంటే.. తేనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తయారుచేయటానికి వేడి నీళ్లకు బదులు పాలు కూడా వాడొచ్చు. అయితే.. మిల్క్‌ కన్నా కూడా హాట్‌ వాటరే బెస్ట్‌ సొల్యూషన్‌ అని చెప్పొచ్చు. వెయిట్‌ తగ్గాలనుకునేవారు గానీ, పూర్తిగా హెల్దీ బ్రేక్‌ఫాస్టే కావాలనుకునేవారు గానీ వేడి నీళ్లు ఉపయోగించటమే ఉత్తమం.

ఇలా.. ఓట్‌ మీల్‌ను తయారుచేసుకున్న తర్వాత ప్రొటీన్‌ పాయింటాఫ్‌ వ్యూలో కావాలనుకుంటే వాటిని ఏవిధంగా యాడ్‌ చేస్తాం? ఏమేం వేస్తే ఎంతెంత ప్రొటీన్‌ వస్తుంది? అనేవి చూద్దాం. 6 ఆల్మండ్‌ విత్తనాలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఓట్స్‌ మిక్చర్‌లో వేయాలి. వీటితోపాటు వాల్‌నట్స్‌ కూడా కొన్ని వేయాలి. వాల్‌నట్స్‌ని కలపటం వల్ల మిశ్రమం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. టేస్ట్‌ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా అయ్యాక ఈ ఓట్స్‌ మీల్‌కి సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌(పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు), పమ్‌కిన్‌ సీడ్స్‌(గుమ్మడికాయ విత్తనాలు) వంటిని కలుపుకోవచ్చు.

దీనివల్ల టేస్ట్‌ ఇంకా పెరుగుతుంది. ప్రొటీన్‌ కంటెంట్‌ సైతం ఎక్కువవుతుంది. వీటన్నింటి ద్వారా మనకు ఓవరాల్‌గా న్యాచురల్‌ వేలో (సహజమైన రీతిలో) ఈజీగా 25 నుంచి 30 గ్రాముల వరకు ప్రొటీన్‌ అందుతుంది. అంటే.. ఒక రకంగా ఇది మన శరీరానికి హెవీ మీల్‌గా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలనుకుంటే ‘‘ఎన్‌టీవీ లైఫ్‌’’ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షించొచ్చు.