నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన వీటిని తిరిగి ఉపయోగించే అవకాశం లేదు. మట్టిలో కలిసిపోవడానికి దశాబ్దాల సమయం పడుతోంది. అడ్డూ అదుపూ లేకుండగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తుండ డంవల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా జనాలు అర్థం చేసుకోవడం లేదు.
READ MORE: Game Changer : గేమ్ ఛేంజర్ స్పెషల్ షో రద్దు.. ప్రభుత్వ ఉత్తర్వులు
ఇదిలా ఉండగా.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్, క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని పరిశీలిస్తే.. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయన సమ్మేళనాలు ఇందుకు కారణమవుతుంటాయి. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల్లో ఈ సమ్మేళనాలు గ్యాస్ రూపంలో బయటకు వస్తాయి. వాటిని పీల్చినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇక మన రోజువారీ జీవనశైలిలో ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలను ఎక్కువసేపు ఉంచి వాటిని తీసుకున్నప్పుడు కొంత ప్లాస్టిక్ కరిగి జీర్ణకోశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
READ MORE: Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు
ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలను పెట్టకపోవడం, అవెన్‌లో పెట్టి వేడి చేయకపోవడం, అలాంటి వస్తువులను వాడకపోవడం మంచిది. అలాగే క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను విడుదల చేసే పరిశ్రమలకు దూరంగా ఉండడం అన్ని రకాలుగానూ మంచిది. ఏ రకంగా అయినా సరే- ప్లాస్టిక్ వినియోగానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉన్నప్పుడే ఇటు క్యాన్సర్, అటు ఇతర అనారోగ్యాల ముప్పును తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి సారించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకోవాలి.