NTV Telugu Site icon

Alcohol : మద్యం తాగిన వెంటనే శరీరంలో కలిగే మార్పులు?

Alcohol

Alcohol

మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా “మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు. కొందరు పని నుంచి వచ్చాక రాత్రి నిద్ర పట్టాలనే సాకుతో రోజూ కొంత మోతాదులో మద్యం తీసుకుంటుంటారు. ఇలా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని భావిస్తారు. కానీ ఓ నివేదిక మాత్రం సంచలన విషయాలు వెల్లడించింది. మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ (Cancer) లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ వెల్లడించింది.

READ MORE: Delhi: స్పెషల్ పోలీసుల దాడి.. రూ.2వేల కోట్ల డ్రగ్స్ సీజ్

అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం మందగిస్తుంది. శ్వాస క్రియ కూడా సరిగ్గా ఆడదు. ఇది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన ఏర్పడుతుంది.

READ MORE:Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌లో గుబులు!.. నాయకులపై రాహుల్ గాంధీ సీరియస్

ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సృహ తప్పిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే, మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. అనంతరం ఆల్కహాల్‌ కణాలను విచ్చిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్‌ గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది. అనంతరం ఆల్కహాల్‌ కణాలను విచ్చిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్‌ గా విడిపోతుంది.