NTV Telugu Site icon

Sleeping paralysis: నిద్రలో ఛాతిపై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తుందా..? నోటి నుంచి మాట రావట్లేదా?

Sleeping Paralysis

Sleeping Paralysis

ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. నిద్రలో ఒక్కోసారి మనకి భయంకరమైన కలలు వస్తుంటాయి. అప్పుడు అకస్మాత్తుగా మీకు తెలివి వచ్చినా ఏటూ కదల్లేరు. ఏం చేయలేని పరిస్థితిలో కూరుకుపోతాం. చాలా మందికి ఇలాంటి అనుభూతి కదులుతుంది. ఆ సమయంలో మీరు తలను కూడా పైకి కదలించ లేరు. ఆ సమయంలో గట్టిగా అరవాలని అనుకుంటారు. కానీ మాట పడిపోతుంది. శబ్ధం బయటకు రాదు. చాతిపై బరువైనది ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది.

READ MORE: Bangladesh clashes: బంగ్లాదేశ్‌ ఘర్షణల్లో 93కి చేరిన మృతుల సంఖ్య..

సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు దెయ్యం పీడిస్తుందని.. గాలి సోకిందని పెద్దలు భావిస్తుంటారు. నిజానికి సైన్స్ ప్రకారం దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు ఈ పరిస్థితిలో మీ ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది. మీరు శ్వాస కూడా తీసుకోలేరు. కాబట్టి ఇది భయానక కల కాదు. దెయ్యాల వలయం కూడా కాదు. అయితే వైద్య పరిభాషలో దీనిని స్లీప్ పక్షవాతం అంటారు. అలా జరిగినప్పుడు కొన్ని నిమిషాల వరకు కదలలేరు. నోటి నుంచి మాటలు కూడా బయటకు రావు. నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి, అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది.

READ MORE:Waqf board: వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం.. కేంద్రం యోచన.!

నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి, అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది. నూటికి తొంబై శాతం మందికి నిద్రలోనే ఈ సమస్య వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కమ్మటి సువాసనలు వెదజల్లే 2, 3 ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను దిండుపై వేస్తే చక్కగా నిద్రపోతారు. దీంతో పాటు శరీరానికి తగినంత విశ్రాంతిని అవసరం.