NTV Telugu Site icon

Health Tips: నూడుల్స్ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే

Hakka Noodles Ws

Hakka Noodles Ws

నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు వీటిలో అధికంగా ఉండవు, కాబట్టి ఇవి ఆరోగ్యానికి చేసే మేలు చాలా తక్కువ. నూడుల్స్ తరచుగా తినడం వల్ల శరీరంపై చాలా దుష్ప్రభావాలు పడతాయి. మీరు కూడా ప్రతి వారం నూడుల్స్ తినే వారైతే ఓసారి ఈ మార్పులు మీలో కలిగాయేమో లేదో చూసుకోండి.

1. అధిక బరువు: నూడుల్స్ ను తరచుగా తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు. తినడం అలవాటుగా మారుతే మాత్రం ఊబకాయం బారిన పడతారు. శరీరంలో సోడియం అధికంగా చేరడం, శరీరంలో నీరు నిలిచిపోవడం వంటివి జరుగుతాయి.

2. లైంగిక జీవితం: నూడుల్స్ అధికంగా తింటే ప్రతికూల పరిణామాలు పురుషుల్లో వెంటనే కనిపిస్తాయి. వీరిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. నూడుల్స్ లో ఉండే సింథటిక్ పదార్థాలు సెక్స్ హార్మోన్లను డిస్ట్రర్బ్ చేస్తాయి. దీని వల్ల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది.

3.మెటబాలిక్ సిండ్రోమ్: నూడుల్స్ అధికంగా తినే మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ వస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ప్రతి వారం నూడుల్స్ తినే వారిలో ఆరోగ్యానికి కచ్చితంగా భంగం కలుగుతుంది.

4. పోషకాలు నాశనం: నూడుల్స్ వంటి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాలు అందక నీరసంగా మారిపోతారు. అలసట పెరిగిపోతుంది. ఇతర ఆరోగ్యకరమైన ఆహారాల్లోని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరం గ్రహించుకోవాలంటే నూడుల్స్ తినడం మానేయాలి.

5. మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు నూడుల్స్ ను వెంటనే దూరం పెట్టాలి. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి ఉన్నవారు తింటే వారి ఆరోగ్యం మరింత దిగజారుతుంది.

చూశారు కదా జర ఇకనుండైనా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ పక్కన పెట్టి శుభ్రంగా ఇంట్లో అమ్మ చేసింది తిందాము.. లేకుంటే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడితే ఫాస్టుగానే పోతాము.