Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Depression: డిప్రెషన్ అనే పదం ఇప్పుడు కామన్‌గా మారింది. యువత ఎక్కువగా డిప్రెషన్‌కు లోనవుతున్నారు. కానీ.. ఈ మానసిక సమస్య చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఎంతోమంది చదువులు, మార్కుల ఒత్తిడికి బలవుతున్నారు. కెరీర్, ఫ్యామిలీ పరంగా అన్నీ ఉన్నా కొందరు యువత డిప్రెషన్ సమస్యతో జీవితాన్నే అల్లకల్లోలం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని అంతలా మార్చేస్తుంది డిప్రెషన్. ఈ సమస్య కేవలం ఏ ఒక్కరి సమస్య కాదు. యువత, సామాన్యులనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంతకీ డిప్రెషన్ రావడానికి కారణం ఏంటి? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలనే విషయాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం..
డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణాలు..?
డిప్రెషన్ అనేది ఓ మానసిక సమస్య. ఒక వ్యక్తి నిరంతరం విచారంగా ఉన్నా, అలసట, ప్రతికూల ఆలోచనలు చేస్తున్నా ఈ ప్రాబ్లెం ఉన్నట్లే. హార్మోన్ల అసమతుల్యత, మెదడులో రసాయన మార్పులు, ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులు, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా కోలుకోలేని దెబ్బ పడినప్పుడు, లేదా బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్ బారిన పడవచ్చు. పేలవమైన జీవనశైలి, పని ఒత్తిడి, సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వస్తోంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు వల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందడం చాలా ముఖ్యం. లేకుంటే జీవితాంతం అశాంతితోనే గడపాల్సి వస్తుంది.
Also Read
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
- Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
భావోద్వేగాల్ని మీలోనే దాచుకుంటూ కుమిలిపోవద్దు. భయపెట్టే సంఘటనలు కావచ్చు.. ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు కావచ్చు.. సమస్యలేవైనా.. ఎలాంటివైనా.. సరే ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల చాలావరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొంత భారం తీరినట్లు అనిపిస్తుంది కూడా. వీలైతే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ సమస్యల గురించి వివరించండి. దీనివల్ల మనసు తేలికపడే అవకాశమూ లేకపోలేదు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మేలైన ప్రత్యామ్నాయాల్లో ధ్యానం (మెడిటేషన్) కూడా ఒకటి. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయాలి. ఫలితంగా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది.
ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
డిప్రెషన్ నుంచి బయట పడటం అంత ఈజీ కాదు. కానీ.. ఈ నియమాలు పాటిస్తే ఈజీ అవుతుంది. ముందుగా మనసుకు మరింత బాధ కలిగినప్పుడు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను నెమరువేసుకోండి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోండి. అలాగే మీ చిన్ననాటి విశేషాలు గుర్తుకు తెచ్చుకోవడం.. మంచి మ్యూజిక్ వినడం.. ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నమైపోయి బాధ నుంచి విముక్తి పొందండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఓ వారం పాటు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రండి. మీరు అమితంగా ఆరాధించే, బాగా ఇష్టపడే వ్యక్తులతో వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉండండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, శారీరక ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవడానికి సరైన వ్యాయామం కూడా కీలకమే. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై మనసు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి. అందుకే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్స్, టెన్నిస్.. ఇలా నచ్చిన అంశానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు కేటాయించండి. రోజంతా ఆనందంగా గడిపేయండి.
ఒత్తిడి పెరిగిపోవడం, మానసిక ప్రశాంతత కరువవడం.. ఇలాంటి సమస్యలన్నింటికీ నిద్ర లేకపోవడమే ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే ప్రతి రోజూ కనీసం ఏడెనిమిది గంటలైనా నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. రాత్రుళ్లు బాగా నిద్ర పట్టాలంటే సాయంత్రం ఆరు తర్వాత కాఫీ, టీ.. వంటి కెఫీన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. అదేవిధంగా సరిపడినన్ని నీళ్లు తాగడమూ ముఖ్యమేనని మర్చిపోకండి. అలాగని శీతల పానీయాలు, సోడాలు తీసుకోకపోవడం మంచిది. వీటికి బదులుగా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ.. లాంటివి అటు ఆరోగ్యానికి.. ఇటు మనసుకు హాయినిచ్చే పానీయాలు. అలాగే కాఫీ, టీ లను కూడా సాధ్యమైనంత మితంగా తాగడం మంచిది. అలాగే మంచి ఆహారం శరీరానికి మేలు చేసే ఫుడ్ తీసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..