Site icon NTV Telugu

Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది మీ కోసమే!

Drinking Risks

Drinking Risks

Health Tips: యూతే కాదు.. అన్ని రకాల వయస్సు వారు డిసెంబర్ 31 అంటే సరికొత్త వైబ్‌తో ఉంటారు. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న శుభసందర్భంగా సంవత్సరం అంతా పడిన బాధలు, ఎదురైన సంతోష క్షణాలు, చేజారిన అవకాశాలు, కొత్తగా చేరిన బంధాలు, కోలుకోలేని దెబ్బ కొట్టిన వ్యక్తులు ఇవన్నీ కలగలిపిన భారాన్ని వదిలేయడానికి డిసెంబర్ 31 రోజున మనసుకు బాగా దగ్గర మనుషులతో కలిసి కూర్చోవడం చాలా మందికి అలవాటు. ఇలా కావాల్సిన వారితో కలిసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని చాలా రోజుల ముందు నుంచే ప్లాన్స్ కూడా చేసుకుంటుంటారు. అయితే ఒక్క నిమిషం.. ఇలా ప్లాన్ చేసుకున్న వాళ్లలో మందుబాబులు ఉంటే ఈ స్టోరీ మీకోమే.

READ ALSO: PM Modi: వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

2026 నూతన సంవత్సర వేడుకలు, పార్టీ, సంగీతం, స్నేహితులు, వైబ్స్ అన్నీ కూడా కరెక్ట్‌గానే అనిపిస్తాయి. అయితే ఈ వేడుకల్లో సరదా స్టార్ట్ చేసేది ఒక ఆరోగ్య ప్రమాదంగా మార్చగల తప్పు ఉంది. ఈ తప్పు ఏమిటంటే.. ఖాళీ కడుపుతో మద్యం తాగడం. చాలా మంది ప్రజలు తరచుగా ఇలా అంటారు.., “ముందుగా తాగుదాం, తర్వాత తిందాం” అని. నిజానికి అందరికీ ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఆరోగ్య నిపుణుల దృక్కోణం నుంచి, ఇది శరీరంపై అనేక రకాల చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.

ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల మత్తు తలకెక్కడమే కాకుండా, అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా ఈ మందు అనేది ప్రత్యక్ష దాడి చేస్తుంది. దీని తక్షణ ప్రభావాలలో తలతిరగడం, వాంతులు, ఆందోళన అనేవి ఉన్నాయని, అలాగే ఇది దీర్ఘకాలికంగా కాలేయం, కడుపు, మెదడు ఆరోగ్యం క్షీణించడానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాటు వల్ల ఈ ఐదు శరీర భాగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని వివరిస్తున్నారు.

1. మెదడు
తినకుండా తాగుతే.. శరీరంలో మద్యం శోషణను నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మద్యం రక్తంతో కలిసి మెదడుకు చేరుతుందని, ఇది కమ్యూనికేషన్ మార్గాలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇది ఆలోచన, సమన్వయం, జ్ఞాపకశక్తిని వేగంగా ప్రభావితం చేస్తుందని, అలాగే ఇదే పద్ధతి నిరంతరం జరిగితే చూపు మసక బారడం, శాశ్వత నాడీ సంబంధిత నష్టాన్ని మూట గట్టుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

2. కాలేయం
ఆల్కహాల్‌ను జీవక్రియ చేసే ప్రధాన అవయవం కాలేయం. కానీ ఇది ఒకేసారి పరిమిత మొత్తంలో మాత్రమే పానీయాన్ని ప్రాసెస్ చేయగలదు. అయితే అకస్మాత్తుగా ఖాళీ కడుపుతో పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం సామర్థ్యం పెరుగుతుంది. దీంతో కాలేయంలో విషపూరిత ఎసిటాల్డిహైడ్ పేరుకుపోతుంది. ఇది కాలేయ వాపు, కణాల నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో కాలేయ వ్యాధి, హెపటైటిస్, సిర్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తారు.

3. గుండె
అతిగా మద్యం మత్తులో ఉండటం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు తాత్కాలికంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది అరిథ్మియా (క్రమరహిత హృదయ స్పందనలు) కు దారితీస్తుందని వెల్లడించారు. దీర్ఘకాలికంగా అతిగా మద్యం తాగడం చేస్తే కార్డియోమయోపతి (గుండె కండరాల బలహీనత), అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.

4. కడుపు
నిజానికి ఆల్కహాల్ కడుపు పొరకు చికాకు కలిగించేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, ఆల్కహాల్ సున్నితమైన శ్లేష్మ పొరలతో ప్రత్యక్ష సంబంధంలోకి వస్తుందని, దీని వల్ల కడుపులో చికాకు, వాపు (గ్యాస్ట్రిటిస్), ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుందని, అలాగే అల్సర్లు, రక్తస్రావం జరిగే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

5. క్లోమం
ఆల్కహాల్ అనేది క్లోమం విషాన్ని ఉత్పత్తి చేయడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఇది తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ అని పిలువబడే క్లోమం యొక్క బాధాకరమైన, ప్రమాదకరమైన వాపుకు దారితీస్తుందని, ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే, ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO: Pawan Kalyan: 45 రోజులు అని చెప్పాం.. 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపాం!

Exit mobile version