Healthy Smoothie: ప్రతిరోజుకు హెల్తీ స్మూతీస్.. సహజ ఆరోగ్యం, అందం, ఆనందం మీ సొంతం!
- ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యం చాలా ముఖ్యం
- ఉదయాన్నే తీసుకొనే స్మూతీస్ ఆరోగ్యానికి మేలు
- స్మూతీస్ వల్ల సహజ ఆరోగ్యం, అందం మీ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Smoothie For Everyday: ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారానిదే కీలక పాత్ర. ఉదయాన్నే తీసుకొనే కొన్ని స్మూతీస్ మరింత మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. సరైన పోషకాలు తీసుకోవడానికి స్మూతీలు ఒక అద్భుతమైన ఎంపిక. ఇవి తేలికగా తయారవుతాయి, జీర్ణానికి సులభం, శరీరానికి అవసరమైన విటమిన్లు-ఖనిజాలు-ఫైబర్‌ను సమృద్ధిగా అందిస్తాయి. వారంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన స్మూతీ తీసుకుంటే.. శరీరం తాజాగా ఉండటమే కాకుండా శక్తి కూడా పెరుగుతుంది.
సోమవారం స్మూతీ:
గ్రీన్ ఆపిల్, అరటి, పాలకూర ఆకులు, కీరదోసకాయ, చియా గింజలు కలిపి చేసిన ఈ గ్రీన్ స్మూతీ డిటాక్స్‌కు ఉత్తమం. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
మంగళవారం స్మూతీ:
అరటి, ఓట్స్, ఖర్జూరాలు, దాల్చిన చెక్కతో చేసిన ఈ స్మూతీ ఉదయం ఎనర్జీ బూస్టర్‌గా పని చేస్తుంది. దీంట్లో ఫైబర్, సహజ తీపి ఉండటంతో శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది.
బుధవారం స్మూతీ:
అరటి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బాదం, బాదం పాలు, తేనెతో తయారయ్యే ఈ బెర్రీ స్మూతీ యాంటీ ఆక్సిడెంట్స్‌కి మంచి మూలం. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గురువారం స్మూతీ:
క్యారెట్, నారింజ, అవకాడో, నారింజరసం, తేనె కలిపిన ఈ ఆరెంజ్ స్మూతీ విటమిన్ C, బీటా కెరోటిన్‌తో నిండినది. ఇది కళ్ల ఆరోగ్యానికి, చర్మ కాంతికి సహాయపడుతుంది.
Also Read: Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
శుక్రవారం స్మూతీ:
బీట్‌రూట్, మిక్స్‌డ్ బెర్రీస్, అరటి, గ్రీక్ యోగర్ట్, పాలు కలిపిన ఈ స్మూతీ రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది.
శనివారం స్మూతీ:
బ్లూబెర్రీ, ఓట్స్, చియా గింజలు, బాదం పాలు కలిపిన ఈ స్మూతీ హార్ట్ హెల్త్‌కు మంచిది. ఇది ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌తో నిండినది.
ఫైనల్లీ:
ప్రతిరోజూ ఒక స్మూతీ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సహజంగా లభిస్తాయి. జంక్ ఫుడ్‌కు బదులుగా ఈ సహజ పానీయాలను అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యవంతమైన జీవనశైలి సులభంగా సాధ్యమవుతుంది.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!