Curry Leaves Water Good or Bad for Health: కరివేపాకులోని సువాసన, రుచి మనందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. సాంబార్, దోస మరియు కొబ్బరి చట్నీ వంటి దక్షిణ భారత వంటకాలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది ‘ఆయుర్వేద నిధి’గా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకు మాత్రమే కాదు.. కరివేపాకు నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. కరివేపాకు నీరు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని భారతదేశపు ప్రసిద్ధ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ అంటున్నారు.
కరివేపాకు అనేక రకాలుగా మనం తీసుకుంటాం. వంటల్లో వాడడం, కరివేపాకు పచ్చడి, కరివేపాకు రైస్ ఇలా ఎన్నో రకాలుగా నిత్యం మనం తింటూనే ఉంటాం. అలానే కరివేపాకు నీరు కూడా తీసుకోలేని నిపుణులు అంటున్నారు. కరివేపాకు నీరు తయారుచేసుకోవడం చాలా సులువు. ఒక పాన్‌లో ఒక కప్పు నీటిని మరిగించాలి. గ్యాస్ ఆఫ్ చేసి.. ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి. ఆ నీరు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి.. ఆపై కరివేపాకు ఆకులను తీసేయాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. కరివేపాకు నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Curry Leaves Water) ఏంటో చూద్దాం.
Also Read: Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్‌జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!
బరువు తగ్గడానికి:
కరివేపాకు నీటిని బరువు తగ్గించే పానీయంగా ఉపయోగించవచ్చు. దీని వినియోగం ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీని ప్రభావం కొన్ని రోజుల తర్వాత మాత్రమే కనిపిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ:
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకు, కరివేపాకు నీరును తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాక్సిటివ్‌లు ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
శరీర నిర్విషీకరణ
కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విష మలిణా లు తొలగిపోతాయి. వాస్తవానికి ఈ ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీర నిర్విషీకరణకు సహాయపడతాయి. చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు మరియు ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మానసిక ఒత్తిడి దూరం:
ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పనిభారం, డబ్బు, అనారోగ్యం మొదలైన కారణాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కరివేపాకు నీళ్లు తాగితే టెన్షన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.