వేసవి కాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి కాకుండా కీర దోసను ఎక్కువగా తీసుకుంటారు.. అయితే సమ్మర్ లో మాత్రమే కాదు వింటర్ లో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చలి కాలంలో కీర దోసను తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుందాం..
చలికాలంలో కీర దోసకాయను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
*. చలికాలంలో మనం చల్లదనానికి ఎక్కువ నీరు తాగలేము ఇలాంటి సమయంలో కీర దోసకాయను తినవచ్చు ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది..
*. కీరదోసకాయ తినడం వలన చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
*.కీరదోసకాయ తినడం వలన మన శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
*. కీరదోసకాయ తినడం వలన మన చర్మంలో నిగారింపు కనిపిస్తుంది.
*. జుట్టు పొడిబారకుండా చేస్తుంది.. ఊడి పోకుండా కాపాడుతుంది..
*. కీరదోసకాయను తినడం వలన అది మన శరీరం లో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
*. కీరదోసకాయను తినడం వలన మన కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు కీరదోసకాయను తింటే అధిక బరువు తగ్గుతారు..
*. కీరలో మినరల్స్ అధికంగా ఉంటాయి.. అందుకే వీటిని తీసుకోవడం చాలా మంచిది.. జ్యూస్ గా లేదా సలాడ్స్ గా తీసుకోవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.