Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Pappu Chakodilu Recipe: సాయంత్రం వేళల్లో టీతో పాటు కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినా, పిల్లల స్కూల్ స్నాక్స్ బాక్స్‌ల కోసమైనా పప్పు చకోడీలు బెస్ట్ ఛాయిస్. సాధారణంగా మనం స్వీట్ షాపుల్లో కొనే చకోడీలు భలే క్రిస్పీ, టేస్టీగా ఉంటాయి. కానీ ఇంట్లో ట్రై చేస్తే ఒక్కోసారి సరిగ్గా రావు లేదా మెత్తబడిపోతాయి. అయితే సరైన కొలతలు, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే స్వీట్ షాప్ కంటే రుచికరమైన పప్పు చకోడీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే దాదాపు 20 రోజులకు పైగా నిల్వ ఉండే ఈ టేస్టీ చకోడీల తయారీ విధానం ఇక్కడ చూద్దాం..
కావలసిన పదార్థాలు
* బియ్యప్పిండి – 2 కప్పులు
* మైదా పిండి – 1 కప్పు
* పచ్చి శనగపప్పు – 1 కప్పు (4 గంటలు నానబెట్టినది)
* నీళ్లు – 3 కప్పులు
* ఉప్పు – 2 టీస్పూన్లు
* పసుపు – ½ టీస్పూన్
* కారం – 1 టీస్పూన్
* వాము – 1 టీస్పూన్ (ఆప్షనల్)
* ఫుడ్ కలర్ – చిటికెడు (ఆప్షనల్)
* నూనె లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు (పిండి కలపడానికి)
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
Also Read
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
తయారీ విధానం
పిండి తయారీ
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల బియ్యప్పిండి, ఒక కప్పు మైదా పిండి వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యప్పిండి వల్ల చకోడీలు గుల్లగా వస్తే, మైదా పిండి వల్ల చుట్టేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, పిండి తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల నీళ్లు పోయాలి. అంటే మొత్తం 3 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్లు సమపాళ్లలో ఉండాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, నచ్చితే వాము, చిటికెడు ఫుడ్ కలర్ వేయాలి. ఈ నీటిని కేవలం ఒకట్రెండు పొంగులు మాత్రమే కాకుండా బాగా ఎక్కువగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగితేనే చకోడీలు చక్కగా గుల్లగా వస్తాయి. నీళ్లు మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, కలిపి ఉంచుకున్న పిండిని వేసి ఉండలు లేకుండా కలపాలి. అనంతరం మూత పెట్టి పిండిని ఆవిరిపై కాసేపు మగ్గనివ్వాలి.
శనగపప్పు సిద్ధం
పిండి ఆవిరిపై మగ్గేలోపు, 4 గంటల పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు వార్చేయాలి. తర్వాత ఒక పొడి క్లాత్‌పై వేసి తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా మారిన పిండి మిశ్రమంలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె (లేదా బటర్) వేసి చేత్తో గట్టిగా ఒత్తుతూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టి ఉంచాలి. అందులోంచి కొద్దికొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ రోల్ చేసుకోవాలి. పప్పు చకోడీలను మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే రోల్ చేయాలి. సన్నగా చేస్తే నూనెలో విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా రోల్ చేసిన పిండిపై శనగపప్పును అద్ది, రెండు చివర్లను కలిపి రింగ్ లాగా చుట్టుకోవాలి. పప్పు సరిగ్గా అంటుకోకపోతే చేత్తో సున్నితంగా నొక్కి సర్దుకోవాలి.
వేయించుకునే పద్ధతి
బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చకోడీలను వేసి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు.. లేదంటే అవి విరిగిపోతాయి. కాసేపటికి చకోడీలు గట్టిపడ్డాక మాత్రమే నిదానంగా తిప్పుతూ వేయించాలి. ఎక్కువసార్లు కలపడం వల్ల పప్పు రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి.చకోడీలు వేసినప్పుడు వచ్చే నూనె నురగ పూర్తిగా తగ్గిపోయిందంటే అవి పర్ఫెక్ట్గా వేగినట్లే. అప్పుడు వాటిని నూనె నుంచి తీసి ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజులకు పైగా కరకరలాడుతూ ఎంతో తాజాగా ఉంటాయి.
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!