Site icon NTV Telugu

Ceremony: ఆవు బొమ్మతో గృహ ప్రవేశం.. మారుతున్న సాంప్రదాయాలు

Untitled Design (2)

Untitled Design (2)

ఈ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కటి మారిపోతున్నాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలు ఆధునికత దిశగా పయనిస్తున్నాయి. అయితే ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లోకి మొదటగా ఆవుని పంపి..గృహ ప్రవేశం చేస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఓ ఆవు బొమ్మతో గృహ ప్రవేశాన్ని పూర్తి చేశారు.

Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లో ఆవు బదులు.. ఆవు బొమ్మతో గృహా ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహప్రవేశం సందర్భంగా సాంప్రదాయం ప్రకారం గృహ ద్వారం ముందుగా ఆవును ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ నగరంలోని ఓ కుటుంబం మాత్రం నిజమైన ఆవు బదులుగా బొమ్మ ఆవుతో ఆ పద్ధతిని పూర్తి చేసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. టెక్నాలజీ యుగం సాంప్రదాయాలను ఎలా ప్రభావితం చేస్తోంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది.

Read Also:Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..

అయ్యవార్లు పూజ చేస్తూ.. శ్లోకాలు పటిస్తుండగా.. చిన్న పాటి ఆవు బొమ్మను తీసుకువచ్చారు. దానికి పూల మాల వేసి ఇంట్లో నడిపించారు. ఇంట్లో ఉన్న వాళ్లంతా బొమ్మను చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నిజమైన ఆవును పై అంతస్థులో ఉన్న ఫ్లాట్ వరకు ఎక్కలేదని.. అందువల్లే బొమ్మ ఆవుకి పూజ చేసి ఇంట్లో నడిపించనట్లు తెలుస్తోంది.

Read Also:Sai Dharam Tej: వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం

టెక్నాలజీ యుగంలో సాంప్రదాయాలు, ఆచారాలు కూడా ఆధునికత దిశగా పయనిస్తున్నాయి. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు షాక్ అయి.. రకరకాలుగా స్పందించారు. ‘సౌకర్యం దృష్ట్యా చక్కటి ఆలోచన’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. మరికొందరు ‘సాంప్రదాయాల విలువ తగ్గిపోతోందని’ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ వీడియో చూసిన పండితులు, స్వామీజీలు మాత్రం ఇలాంటి మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version