కొబ్బరిబొండాలే కాదు కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. గోరు నుంచి జుట్టు వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.. అయితే కొబ్బరితో రకరకాల వంటలను చేస్తారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటను చేస్తారు.. మన దేశంలో అయితే పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు చేస్తారు..అలాగే ఈ పచ్చికొబ్బరితో మనం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.. బెల్లం, కొబ్బరి కలిపి తీసుకుంటే ఐరన్ శాతం పెరుగుతుంది..రక్త హీనత వంటి సమస్యలు తగ్గుతాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ కొబ్బరి లడ్డుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – అర చిప్ప,
బెల్లం తురుము – ఒక కప్పు,
నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్,
యాలకుల పొడి – అర టీ స్పూన్,
నెయ్యి – ఒక టేబుల స్పూన్..
తయారీ విధానం :
ముందుగా కొబ్బరిని సన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.. ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత కరిగించిన బెల్లం నీటిని పోసి కలపాలి.. ఇలా దగ్గర పడేవరకు బాగా వేయించాలి.. కొబ్బరి మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి.. అంతే లడ్డులు తయారైయినట్లే.. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి…