NTV Telugu Site icon

Coconut Burfi : కొబ్బరి బర్ఫిని ఇలా చేసుకోవచ్చు.. టేస్ట్ చూస్తే వదలరు…!

Coconut Burfi

Coconut Burfi

కొబ్బరికాయలు, కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.. అయితే కొంతమందికి సరిగ్గా చేయడం రాక బయట షాపుల్లో తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం ఈరోజు మనం ఈ స్వీట్ ను సింపుల్ గా 15 నిమిషాల్లో చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం..

కావల్సిన పదార్థాలు..

పచ్చి కొబ్బరి – ఒక కొబ్బరి కాయ,

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్,

యాలకుల పొడి – అర టీ స్పూన్,

పంచదార – అర కప్పు..

తయారీ విధానం :

ముందుగా కొబ్బరికాయను తీసుకొని దాని పై నల్లని బాగాన్ని మొత్తాన్ని తీసేయ్యాలి..కొబ్బరిని ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసి కలుపుతూ వేయించాలి. దీనిని పొడి పొడిగా అయ్యి కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పంచదార వేసి కలపాలి.. చక్కర వేసిన తర్వాత మళ్లీ మంటను సిమ్ లో పెట్టి కలపాలి..దగ్గర పడే వరకు కలుపుతూ వేయించాలి.ఆ తరువాత మరో అర టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ బర్ఫీ తయారవుతుంది. చూసారుగా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయిందో.. ఇక ఆలస్యం ఎందుకు కొబ్బరి బర్ఫిని మీరు కూడా ట్రై చెయ్యండి..