Site icon NTV Telugu

Chicken Liver vs Mutton Liver: చికెన్ , మటన్ రెండింటి లివర్లలో దేనితో లాభాలున్నాయో తెలుసా..

Untitled Design (3)

Untitled Design (3)

చికెన్ లివర్, మటన్ లివర్ రెండూ అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలు. సాధారణంగా నాన్ వెజ్ ప్రేమికులు వారానికి కనీసం ఒక్కసారైనా చికెన్, మటన్ లేదా చేపలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పోషకాల పరంగా మరింత సమృద్ధిగా ఉండే చికెన్ లివర్, మటన్ లివర్‌లను ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ రెండింటిలోనూ ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండటంతో శరీరానికి మంచి శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్నవారికి లివర్ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీర్ణశక్తి వంటి అంశాలను బట్టి సరైన లివర్‌ను ఎంపిక చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణుల సూచిస్తున్నారు.

చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఐరన్, సెలీనియం, విటమిన్ A, విటమిన్ B12, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లివర్‌లో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ A మరియు విటమిన్ B12 కంటి ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపకరిస్తుంది. ఉడికించిన చికెన్ లివర్‌ను పరిమిత మోతాదులో తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

చాలా మంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్‌ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మటన్ లివర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా దీన్ని బాగా ఉడికించి తింటారు. ఇందులో విటమిన్ A, విటమిన్ D, విటమిన్ B12, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మటన్ లివర్ తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ B12 రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ చికెన్ లివర్ లేదా మటన్ లివర్‌ను తినడం సరైంది కాదు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అలాగే గర్భిణీలు లివర్ ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version