కాఫీ, ఛాయ్ ఎక్కువగా తాగడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని .. చాలా మంది టీ, కాఫీ తాగడం మానేసారు. అయితే.. తగినంత మోతాదులో కాఫీ, ఛాయ్ తాగితే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే, కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా కండకర్ట్
కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కెఫిన్ సాయపడుతుంది. ఇది మనసును ఆనందంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. కొందరు కెఫిన్ తో పాటు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకుంటుంటారు. కెఫిన్ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.. అలసట తగ్గుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు. కెఫిన్ మనసుకు శాంతిని కలిగిస్తుంది. కెఫిన్ ఉన్న ఆహారాలు, పానీయాలు తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది.
Read Also:AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి
బాడీ ఎక్ససైజ్ చేసేటపుడు కూడా కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవచ్చిన వైద్యులు వివరిస్తున్నారు. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే మెటాబాలిజం రేటు పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. తగిన మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరు బాగుంటుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ప్రతి ఒక్కటి మేము ఇంటర్నెట్ నుంచి మాత్రమే తీసుకున్నామని గ్రహించాలి. అయితే మీరు వీటిని ఫాలో అయ్యేముందు ఒక్కసారి డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం..
