Site icon NTV Telugu

Heart Stroke: గుండె రక్త నాళాల్లో బ్లాకేజ్‌లు.. నలభై నిండకుండానే ఆగిపోతున్న గుండెలు

Heart Stroke

Heart Stroke

Heart Stroke: ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అది కూడా నిండా నలబై ఏళ్లు నిండని వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం మరణించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నెల రోజుల క్రితం పెద్దపల్లిలో ఆఫీసుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికొచ్చి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.. మరొకతను కూడా ఇలానే హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఇలా చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో మరణించడం జరుగుతోంది. ఇందుకు మారుతున్న జీవన శైలితోపాటు గుండె నాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడటమే కారణమని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే గుండె నాళాల్లో బ్లాకేజ్‌లు రావడం ఎంటీ? ఎందుకు వస్తున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు అరవై దాటినవారే గుండె వ్యాధులతో మృత్యువాత పడేవారు. కానీ నేటి డిజిటల్‌ యుగంలో నలభై నిండకుండానే గుండెలు ఆగిపోతున్నాయి. చాలా సందర్భాల్లో హృద్రోగ లక్షణాలు ఏ మాత్రం కనిపించకుండా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. వారికి గతంలో గుండె జబ్బు ఉండేదని తెలియను కూడా తెలియదు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు నిర్ధారిస్తున్నారు. అయితే.. బ్లాకేజ్‌ ఎందుకొస్తుంది? దానిని గుర్తించడం ఎలా?.. మన జీవితంలోనూ అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వైద్య నిపుణులు చెబుతున్నారు..

Read also: LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధర

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని బ్లాకేజీ అంటారు. ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్‌, కొవ్వు పేరుకుపోవడం.. ఇతరత్రా కారణాల వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడతాయి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్‌ చేస్తుంది. రక్తంతో పాటు ఆక్సిజన్‌నూ సరఫరా చేస్తుంది. అదే సమయంలో గుండె తనకు తాను రక్తం, ప్రాణవాయువు అందించుకుంటుంది. ఆ సరఫరాకు సహకరించే నాళాల్లో అవరోధాలు (బ్లాక్‌లు) ఉత్పన్నం కావడం వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్‌ అందవు. దీంతో, గుండె కండరాలకు రక్త సరఫరా నిలిచిపోయి ఆయా భాగాలు చచ్చుబడిపోతాయి. గుండె పనిచేయడం మానేస్తుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది. అయితే ఇక్కడ గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌.. రెండూ వేరువేరు సమస్యలు. రక్త నాళాల్లో బ్లాక్‌లు.. అంటే అవరోధాలు.. ఏర్పడటం వల్ల ‘హార్ట్‌ ఎటాక్‌’ వస్తుంది. అదే గుండెలో విద్యుత్‌ ప్రసరణ ఆగిపోయి గుండె కవాటాల సంకోచ, వ్యాకోచాలు నిలిచిపోవడంతో ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ ఉత్పన్నం అవుతుంది. అంటే, హార్ట్‌ ఎటాక్‌ అనేది కార్డియో అరెస్ట్‌కు దారితీస్తుంది. కానీ, అన్ని హార్ట్‌ ఎటాక్‌ల వల్లా కార్డియాక్‌ అరెస్ట్‌ రాకపోవచ్చు. హార్ట్‌ ఎటాక్‌ అనేది సర్వసాధారణం. ఎందుకంటే, రక్తనాళాలు 2-4 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటాయి. కొలెస్ట్రాల్‌, స్కాబ్‌ తదితరాల వల్ల కొన్నిసార్లు రక్తనాళాల్లో ఈ తరహా బ్లాక్స్‌ (అవరోధాలు) ఏర్పడతాయి. కొన్నిసార్లు, టీనేజ్‌లోనే రక్త నాళాల్లో బ్లాక్స్‌ ఆరంభం కావచ్చు. వీటిని ఓ పట్టాన గుర్తించలేం. ఎందుకంటే, ఆ అవరోధాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాలంటే బ్లాక్స్‌ పెద్దగా ఏర్పడాలి. ఆంజియోప్లాస్టీ, స్టెంట్‌, బలూన్‌ తదితర ప్రొసీజర్స్‌ ద్వారా ఈ బ్లాక్స్‌ను గుర్తించి, అదీ 70 శాతం ఉంటేనే వాటిని ఓపెన్‌ చేసి అవరోధాలను తొలగించి.. స్టెంట్‌ వేస్తారు.

Read also: SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్‌ సొంతం!

70 శాతం బ్లాక్స్‌ ఉన్నవారిలో గుండెనొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. సాధారణంగా యాభై, అరవై ఏండ్లు పైబడిన వారిలోనే ఈ స్థాయిలో బ్లాక్స్‌ ఉంటాయి. అవి మరింత పెరగడానికి కొంత సమయం పడుతుంది. వీటిని వివిధ మార్గాల్లో గుర్తించి తొలగిస్తారు. దీంతో గుండెపోటు లేదా కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు తప్పుతుంది. ఇక చిన్న వయసు వారి విషయానికొస్తే.. 20 నుంచి 40 శాతం మాత్రమే బ్లాక్స్‌ ఉంటాయి. ఇవి 70 శాతానికి పెరిగితే కానీ చికిత్స చేయడం కుదరదు. కానీ అంతలోనే.. 40 శాతం ఉన్న బ్లాకేజ్‌లు బ్రేక్‌ కావచ్చు. కాబట్టే, వీటిని ‘అన్‌స్టేబుల్‌ బ్లాక్స్‌’ అంటారు. వీటివల్ల గుండె రక్తనాళాల్లో గాయం ఏర్పడుతుంది. రక్తం వస్తుంది. దీంతో రక్తనాళాల్లో స్కాబ్‌ ఏర్పడి అప్పటి వరకూ ఉన్న 40 శాతం బ్లాకేజ్‌ ఒక్కసారిగా 100 శాతానికి చేరుకుంటుంది. ఈ పరిణామమంతా ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే.. నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఈ విధంగా చిన్నపాటి బ్లాక్‌లు బ్రేక్‌ కావడం వల్ల 70 శాతం మంది హార్ట్‌ఎటాక్‌, కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించేందుకు సరైన పరీక్షలు లేవు. బీపీ, షుగర్‌ వంటి రుగ్మతలు కూడా లేని పరిపూర్ణ ఆరోగ్యవంతులైన యువతలో గుండెపోటు మరణాలకు కారణం ఇదే.

Read also: Viral: భార్య ఎక్కిన విమానం రావడం ఆలస్యం.. వారందరికి షాక్ ఇచ్చిన భర్త

చిన్నపాటి బ్లాకేజ్‌లు బ్రేక్‌ కావడానికి పొగతాగడం, షుగర్‌, బీపీ, మానసిక-శారీరక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఇన్‌ఫెక్షన్స్‌ .. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఇక బ్లాకేజ్‌ లక్షణాల విషయానికి వస్తే..
గుండెలో బరువుగా ఉండటం., గుండెపై కొట్టినట్టు లేదా ఏదో బరువు పెట్టినట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఆయాసం ఉండటం, ఎడమ చేతి భుజం, మెడ, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వాటి నుంచి తప్పించుకోడానికి.. ప్రత్యేకించి మందుల అవసరం లేదని వైద్యులు చెబుతున్నప్పటికీ.. ధూమపానం మానేయాలని.. మధుమేహం నియంత్రణలో ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిదిద్దుకోవాలని అవకాశం ఉంటే ధ్యానం, యోగ, మంచి ఆహారం ద్వారా కూడా బ్లాకేజ్‌ను తగ్గించవచ్చని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version