Site icon NTV Telugu

Black Coffee Benefits: బ్లాక్ కాఫీ మేజిక్.. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్‌ ఉన్నాయా!

Black Coffee Benefits

Black Coffee Benefits

Black Coffee Benefits: ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచిన వెంటనే చాలా మంది చేతిలో కాఫీ లేదా టీ కప్పు తప్పనిసరిగా కనిపిస్తుంది. రోజు మొదలయ్యే ముందు ఒక్క కప్పు కాఫీ లేకుండా పనులు మొదలవ్వవు అనే స్థాయికి ఇది అలవాటైపోయింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగితే ఎలా ఉంటుందో? అని. చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతాయో అనేది మనం పెద్దగా పట్టించుకోం. అయితే పలువురు వైద్య నిపుణుల అభిప్రాయంలో బ్లాక్ కాఫీని మితంగా తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.

READ ALSO: Prostitution: వీడసలూ మనిషేనా.. కట్టుకున్న భార్యనే..

కీ రోల్ ప్లే చేస్తున్న బ్లాక్ కాఫీ..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ కాఫీని “శక్తివంతమైన పానీయం”గా పేర్కొంటున్నారు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా, పలు రకాల వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

పలు అధ్యయనాల ప్రకారం.. బ్లాక్ కాఫీని మితంగా తాగడం వల్ల గుండె వైఫల్యం లేదా స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. బ్లాక్ కాఫీలోని కేఫిన్ మెదడులో నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల జాగ్రత్త, కేంద్రీకరణ, మరియు ఉత్సాహం పెరుగుతాయి. అంతేకాకుండా దీన్ని క్రమం తప్పకుండా మితంగా తాగడం ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మానసిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజు బ్లాక్ కాఫీని సమతుల్య పరిమాణంలో తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, శిరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ కేన్సర్ (హెపాటో సెల్యులర్ కార్సినోమా) వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా బ్లాక్ కాఫీ సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే బ్లాక్ కాఫీ అనేది మితంగా తీసుకోవడం ద్వారా గుండె, కాలేయం, మెదడును కాపాడే మంచి ప్రాకృతిక టానిక్‌గా పని చేస్తుందని చెబుతున్నారు.

ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం సుమా..
ఏ ఆహారమైనా, పానీయమైనా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన లేదా జీర్ణ సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజుకు 1–2 కప్పులు బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

READ ALSO: Pakistan – Afghanistan: పాక్ పార్లమెంట్‌లో ఆఫ్ఘన్ ప్రకంపనలు.. నంబర్ వన్ శత్రువుగా పోల్చిన రక్షణ మంత్రి

Exit mobile version