NTV Telugu Site icon

Papaya Seeds: బొప్పాయి గింజల్లో పుష్కలమైన విటమిన్స్‌.. బోలెడు ఉపయోగాలు కూడా..

Untitled 9

Untitled 9

Health: ఈ భూమి మీద ఎలాంటి దుష్పరిణామాలు చూపని ఆహరం పండ్లు. అందుకే మనం నిత్యం రకరకాల పండ్లను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటాము. అలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండ్లలో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇందులో విటమిన్లు మొదలైన పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనం ఈ పండుని తిని గింజలను పడేస్తాము. కానీ బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే జీవితంలో ఎప్పుడు బొప్పాయి గింజల్ని పడెయ్యరు. మరి బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:No Marriage: పెళ్లికి నో అంటున్న యువత.. కారణాలు ఇవేనా..

బొప్పాయి గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పొడిని ఆహరం పైన చల్లుకొని తినవచ్చు లేదా స్మూతీస్, సలాడ్లు లేదా ఇతర వంటకాలకు జోడించవచ్చు. గింజలు కొద్దిగా మిరియాలు రుచిని కలిగి ఉంటాయి కనుక మసాలాగా ఉపయోగించవచ్చు. ఇలా బొప్పాయి గింజల్ని తినడం వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కాదు. బొప్పాయి గింజల్లో “పాపైన్” అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, మలబద్ధకం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. విత్తనాలలో “యాంటీఆక్సిడెంట్లు” పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహద పడతాయి. బొప్పాయి గింజలలో “ఫ్లేవనాయిడ్లు మరియు ఫినాలిక్ సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ” లక్షణాలు ఉండటం వల్ల వాపు తగ్గుతుంది మరియు ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే వీటిలో “విటమిన్ సి” ఉంటుంది.

Read also:Health: ఆడవారికంటే మగవారికే ఎక్కువ.. ఏంటో తెలుసా..?

ఇది వ్యాధినిరోధకతను పెంచి వ్యాధుల బారినపడకుండా సహాయపడుతుంది. అలానే ఈ గింజల్లో “ఫైబర్త్ “ఉంటుంది. కనుక అధిక బరువుని తగ్గిస్తుంది. బొప్పాయి గింజలు “యాంటీ-పారాసిటిక్” లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు పురుగులు మరియు ఇతర పరాన్నజీవులను తొలగించడంలో సహాయపడతాయి. బొప్పాయి గింజల్లో గుండె ఆరోగ్యానికి అవసరమైన “మోనోశాచురేటెడ్ కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లు” ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. అలానే ఈ గింజలకు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యం ఉందని నిపుణులు చెప్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments