Fat Loss Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగే పొట్ట, శరీర బరువు అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు. సరైన జీవనశైలి, ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలతో కేవలం మూడు రోజుల్లోనే పొట్టను తగ్గించుకోవడం సాధ్యమేనంటున్నారు పలువురు వైద్య నిపుణులు. చాలా మందికి పొట్ట పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలువురు వైద్య నిపుణులు దీనికి పరిష్కారంగా కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను సూచించారు.
READ ALSO: Indore: 8 ఏళ్లుగా సె*క్స్‌కు నిరాకరిస్తుందని, భార్య హత్య..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. నిద్ర లేవగానే లీటర్‌నర వరకు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయని తెలిపారు. నీటిని ఒకేసారి కాకుండా గ్లాసుల వారీగా తాగుతూ, ఆ తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల పేగుల్లో కదలిక వచ్చి సులభంగా మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. శరీరాన్ని కేవలం ఆహారం ద్వారానే కాకుండా, యోగాసనాల ద్వారా కూడా ఆరోగ్యంగా మలచుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఉత్తానపాదాసనం’ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వెల్లకిలా పడుకుని కాళ్లను 30 నుంచి 45 డిగ్రీల కోణంలో గాలిలోకి లేపి ఉంచడం వల్ల పొట్ట కండరాలపై ఒత్తిడి పడి, అక్కడ నిల్వ ఉన్న అదనపు కొవ్వు కరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పొట్టతగ్గడానికి ఆహార నియమాలే ఆయుధాలు..
పొట్ట తగ్గాలనుకునే వారు ఆహారం విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని పేర్కొన్నారు. తింటున్నప్పుడు మధ్యలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల లోపు ఆహారాన్ని ముగించడం వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉండదని చెప్పారు. కేవలం ఆహారమే కాదు, మానసిక ప్రశాంతత కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నిత్యం క్రమశిక్షణతో కూడిన ఈ జీవనశైలిని అలవరుచుకుంటే, శస్త్రచికిత్సలు, మందులు లేకుండానే ఆరోగ్యకరమైన, అందమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
READ ALSO: Apple Watch Series 11: ఆపిల్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!
