NTV Telugu Site icon

Beer: బీర్ తాగితే.. బాడీ పెరుగుతుందా?

Beer

Beer

Beer: ఈమధ్య కాలంలో చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అందుకే.. ఈ సమాధానం. బీర్ అనేది ఒక ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని.. గోధుమలు, బార్లీ, రైస్ వంటి మాల్‌తో తయారుచేస్తారు. బీర్‌లో ఆల్కహాల్ పర్సంటేజ్‌ 4 నుంచి 6 శాతం మాత్రమే ఉంటుంది. 355 మిల్లీ లీటర్ల బీర్‌లో 153 గ్రాముల క్యాలరీలు, 14 గ్రాముల ఆల్కహాల్, 13 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2 గ్రాముల ప్రొటీన్, జీరో గ్రామ్ ఫ్యాట్ ఉంటాయి. బీర్‌లో కొవ్వు లేదు కాబట్టి దాన్ని తాగితే మన పొట్ట పెరగదని, మనం శారీరకంగా లావు కాబోమని చాలా మంది అనుకుంటారు.

కానీ.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. బీర్‌ను ఎక్కువగా తాగటం హెపటైటిస్‌కి దారితీస్తుంది. కాలేయం వాపుకు గురికావటాన్నే హెపటైటిస్ అంటారు. అంటే.. అవసరానికి మించి ఆకలేస్తుంది. దీంతో ఫుడ్డు ఎక్కువగా తినాల్సి వస్తుంది. అంతేకాదు. బీర్ మన బాడీలోని కొవ్వు కరగకుండా ఆపుతుంది. దీనివల్ల కావాల్సినదాని కన్నా ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోతుంది. దీంతో ఆటోమేటిగ్గా బరువు పెరుగుతారు. అందువల్ల.. బీర్‌ తాగితే లావవుతామా అంటే ‘నో’ అని సింపుల్‌గా అనొచ్చు.

read more: India Wanted Pilots: ఇండియాకి కావాలి పైలట్స్. కానీ..

బీర్‌ని ఎక్కువగా తాగటం వల్లే శరీర చుట్టుకొలత పెరుగుతుందని క్లారిటీగా చెప్పొచ్చు. కావున.. లావు కాకుండా ఉండాలంటే బీర్‌ని పరిమితంగానే తాగాలని గుర్తుపెట్టుకోండి. డైలీ.. హాఫ్ లీటర్ బీర్ తాగితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని కొన్ని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. అయితే.. సిట్టింగ్‌ వేసినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకోలేక బీర్‌ డోస్ పెంచితే మీ బాడీలో ఫ్యాట్ డోస్‌ కూడా పెరుగుతుందని మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్య విషయం కాబట్టి అందరికీ తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి.