Site icon NTV Telugu

Health Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇవి తింటే పోతాయి..!

Eyes

Eyes

Health Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? నలుగురిలో మీ ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి. రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సహజంగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తనే ఉంటాయి. అలా అందరికీ రావు. నల్లటి వలయాలు రావడానికి గల ముఖ్యమైన కారణాలేంటంటే నిద్రలేమి, ఆల్కహాల్ ఎక్కువ సేవించడం, స్మోకింగ్, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి పోవాలంటే మనం తినే ఆహార అలవాట్లు, పోషకాహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా నల్లటి వలయాలు మానవుని శరీరతత్వాన్ని బట్టి కూడా ఉంటాయి. విటమిన్స్, ఐరన్ లోపం వల్ల కూడా ఇవి వస్తాయి.

Read Also: Afghanistan: ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తగ్గించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పోషకాలను తీసుకుంటే వాటిని వదిలించుకోవచ్చు. అవి ఏంటేంటో.. ఎలాంటి పోషకాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. టమోటాలు లైకోపీన్ కు గొప్ప వనరు. ఉడకబెట్టిన టమోటాలు లేదా టొమాటో సాస్ తినడం వల్ల డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవచ్చు. పుచ్చకాయ, గులాబీ జామ, ఎండుమిర్చిలో కూడా లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే నల్లటి వలయాలను నివారించవచ్చు.

Read Also: Sharwanand: సీఎం కేసీఆర్ ను కలిసిన శర్వానంద్.. ఎందుకంటే..?

అంతేకాకుండా ఆకుకూరల లాంటి వాటిల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర, మెంతి కూర వంటి ఆకు కూరలు తినడం వల్ల నల్లటి వలయాలు తగ్గిపోతాయి. కాయధాన్యాలు, బీన్స్, నువ్వులు, బెల్లంలో కూడా ఇనుము పదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో ఇనుము లేకపోతే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆర్బిసిలలో తగ్గుదలకు దారితీస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగ, అవిసె గింజలు విటమిన్ ఇ కి అద్భుతమైన వనరులని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version