NTV Telugu Site icon

Shawarma Side Effects : బయట దొరికే షవర్మాను ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..

Chicken (3)

Chicken (3)

బయటకు వెళ్ళినప్పుడు ఏదోకటి తినే వస్తాము.. ఈరోజుల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, షేవర్మ వంటివాటిని ఎక్కువగా తింటారు. షావర్మా. ఇది మనకు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడే లభిస్తోంది. చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు.. బాగా పాపులర్ అయిన హోటల్స్ లో తినడం మాట పక్కన పెడితే రోడ్డు దొరికే షవర్మాను ఎక్కువగా తింటారు.. అయితే దీన్ని తిని ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న విషయం తెలిసిందే..

చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు. అయితే హోటల్స్ మాట అటుంచితే రహదారుల పక్కన బండ్లపై లభించే దీన్ని తింటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. అందుకు బయట దొరికే వాటిని తినడం వల్ల బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

మాములుగా షావర్మాలో మాంసాన్ని తీగకు గుచ్చి వేడి చేసి విక్రయిస్తారు. అయితే మాంసం సరిగ్గా ఉడికితే ఫర్వాలేదు. కానీ మాంసం ఉడకకపోతే అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుతుంది.. దానివల్ల పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఆ షావర్మాను తింటే మనం ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.. అందుకే వీటిని బాగా ఉడికితేనే తినాలని నిపుణులు చెబుతున్నారు.. కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కనుక షావర్మా తినేవారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments