NTV Telugu Site icon

Health Tips యాలకుల నీటిని తాగడం వల్ల ఏం అవుతుందో తెలుసా?

Cardomom

Cardomom

మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో యాలుకలు కూడా ఒకటి.. వంటల్లో సువాసనలు వెదజల్లడం కోసం మాత్రమే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు- ఐరన్‌, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది.. బరువు అదుపులో ఉంటుంది.. ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

యాలుకలు వేసి మరిగించిన తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు.. విటమిన్ సి వీటిలో బాగా ఉంటుంది.. రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. యాలకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా, కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. అందుకే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది..

ఒత్తిడిని తగ్గించడంలో ఇది బేషుగ్గా పనిచేస్తుంది.. నోటి సమస్యలు తగ్గిపోతాయి.. దంత సమస్యలు తగ్గడం మాత్రమే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.. యాలకులలో లభించే ఫైటోకెమికల్ అయిన సినియోల్, దుర్వాసన బాక్టీరియాను చంపడానికి దంత సంరక్షణలో సహాయ పడుతుంది.. ఇంకా అనేక రకాల సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.