Site icon NTV Telugu

Alcohol Effects on Sleep: షాకింగ్ నిజాలు.. మద్యం తాగి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Alcohol

Alcohol

Alcohol Effects on Sleep: కొందరు నిద్ర బాగా పడుతుందని మద్యం తాగుతుంటారు. నిజానికిది నిద్రకు చేటే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మందు తాగడం వల్ల గాఢ నిద్రలోకి జారుకోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. బీరు తాగితే ఆదమరిచి నిద్రపోవచ్చనుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపట్టడం నిజమేగానీ.. అది పూర్తి నిద్రా వ్యవస్థనే ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆల్కహాల్ సేవించి నిద్రించడం పల్స్ రేట్ పెరగడానికి దారి తీస్తుంది. ఫలితంగా ఆతురత పెరుగుతుంది. నిద్రించే సమయంలో కళ్లను వేగంగా కదిలిస్తుంటాం. దీన్ని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అంటారు. ఈ కదలికల వల్ల మెదడుపై ఒత్తిడి, భావోద్వేగాల తాలుకా ప్రభావం తగ్గిపోతుంది.

READ MORE: Minister Satya Kumar: స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ సెటైర్లు.. కూటమి సర్కార్ రియాక్షన్..?

సాధారణంగా రాత్రి నిద్రలో 5 నుంచి 7 ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్స్ ఉంటాయి. కానీ ఆల్కహాల్ తాగి నిద్రించిన వారిలో 1 లేదా 2 స్లీప్ సైకిల్స్ తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఫలితంగా మరుసటి రోజు నీరసంగా ఉంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గొంతులోని కండరాలు సహా శరీర కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. గొంతులోని కండరాలు రిలాక్స్ కావడం వల్ల నిద్రించే సమయంలో గురక ఎక్కువ అవుతుంది. కొంత మందైతే నిద్రలో మాట్లాడటం, నడవడం చేస్తుంటారు. దీని వల్ల మెమొరీ పవర్ తగ్గుతుంది.

READ MORE: Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!

రాత్రిపూట మనకు నిద్ర దశలు దశలుగా పడుతుంది. తొలి గంటల్లో తేలికైన నిద్ర, అనంతరం గాఢ నిద్ర (రెమ్‌ స్లీప్‌) పడుతుంది. తిరిగి తేలికైన నిద్ర, గాఢ నిద్ర.. ఇలా పలు దపాలుగా సాగుతుంది. ఒక్కో దశకు సుమారు 90 నుంచి 120 నిమిషాలు పడుతుంది. పడుకోవటానికి ముందు మద్యం తాగితే ఈ దశలకు అంతరాయం కలుగు తుంది. ఫలితంగా గాఢ నిద్ర కొరవడుతుంది. తెల్లారి లేచాక చురుకుగా, ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడేది ఈ గాఢ నిద్రే. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక ధోరణికీ ఇది కీలకమే.

Exit mobile version