NTV Telugu Site icon

Alcohol Study: మద్యం కొంచెం తాగినా ప్రమాదమే!

Alcohol

Alcohol

మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా “మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు. కొందరు పని నుంచి వచ్చాక రాత్రి నిద్ర పట్టాలనే సాకుతో రోజూ కొంత మోతాదులో మద్యం తీసుకుంటుంటారు. ఇలా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని భావిస్తారు. కానీ ఓ నివేదిక మాత్రం సంచలన విషయాలు వెల్లడించింది.

READ MORE: Kangana Ranaut: పెళ్లిపై స్పందించిన కంగనా రనౌత్.. నేను పెళ్లి చేసుకుంటా కానీ..

మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ (Cancer) లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ వెల్లడించింది.
మగవారు డైలీ 20 గ్రాములు, ఆడవారు 10 గ్రాముల ఆల్కహాల్ తాగితే, ప్రమాదం లేదని చాలా మంది చెబుతారు. కానీ లైట్‌ లేదా మోడరేట్ డ్రింకింగ్ వల్ల వృద్ధుల్లో క్యాన్సర్ రిస్క్‌ పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రిటన్‌లో లక్ష మందిని పైగా పరిశీలించారు. మద్యం అలవాటు, జీవనశైలిని పరిశీలించారు. స్టడీలో చిన్న మొత్తంలో ఆల్కహాల్ తాగినా సరే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తేలింది. 60 ఏళ్లు పైబడిన 1,35,103 మంది వృద్ధుల మీద 12 ఏళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. లైట్, మోడరేట్ ఆల్కహాల్ డ్రింకింగ్‌ వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకున్నారు.

READ MORE:Pune Porsche case: ఇద్దరికి చావుకు కారణమైన మైనర్.. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు!

ఈ స్టడీపై యూనివర్సిడాడ్ ఆటోనోమా డి మాడ్రిడ్‌ ప్రొఫెసర్, రీసెర్చ్ పేపర్ లీడ్‌ ఆథర్‌, డాక్టర్ రోసారియో ఒర్టోలా మాట్లాడుతూ “కొంచెం లిక్కర్ డ్రింక్ చేసినా కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. మొదటి చుక్క మద్యం తాగినప్పటి నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకునే అలవాటుతో ప్రయోజనాల లభిస్తాయని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు.” అని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఫలితాలను జమ నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిష్‌ చేశారు.