UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UGC NET December 2025: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, అభ్యర్థులు ఎదురు చూస్తున్న యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) UGC NET డిసెంబర్ 2025 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 7వ తేదీన ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ దరఖాస్తుకు చివరి తేదీ, అర్హత, దరఖాస్తు రుసుము వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Russia: పాకిస్తాన్‌కు రష్యా జెట్ ఇంజన్లు ఇచ్చినా భారత్‌కే లాభం.. ఎలాగంటే..
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
చివరి తేదీ ఎప్పుడంటే..
యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్‌ను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 7, 2025 ( రాత్రి 11:50 గంటలకు ). దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుము, సబ్జెక్ట్ జాబితా, పరీక్షా విధానం, ఇతర ముఖ్యమైన సూచనలను కలిగి ఉన్న అధికారిక సమాచార బులెటిన్‌ను జాగ్రత్తగా చదవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించడానికి అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి NTA UGC – NET పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT) పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఇబ్బంది ఎదురైతే..
UGC –NET డిసెంబర్ 2025 కి దరఖాస్తు చేసుకోవడంలో అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, తక్షణం సహాయం కోసం క్రింద పేర్కొన్న ఛానెల్‌ల ద్వారా సంప్రదించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) సూచించింది. ఫోన్ నంబర్: 011-40759000 / 011-69227700, ఇమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించాలని తెలిపింది. అభ్యర్థుల ఇబ్బందులను తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొంది. UGC –NET డిసెంబర్ 2025 కి సంబంధించిన వివరణ లేదా సహాయం కోసం మాత్రమే వీటిని ఉపయోగించాలని ప్రత్యేకంగా తెలిపింది.
READ ALSO: Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!