NTV Telugu Site icon

SC Law Clerk Recruitment 2025: సుప్రీంకోర్టులో క్లర్క్‌ జాబ్స్.. నెలకు రూ. 80 వేల జీతం

Sc

Sc

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్‌–కమ్‌–రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో పనిచేసే ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

లా క్లర్క్‌–కమ్‌–రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు అర్హుల విషయానికి వస్తే.. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ప్రభుత్వం చేత గుర్తించబడిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ(లా), పీజీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 07.02.2025 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ, 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ పోస్టులకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ. 80 వేల జీతం ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 500 చెల్లించాలి. ఫీజును UCO బ్యాంక్ అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షను మార్చి 9న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ www.sci.gov.in పై క్లిక్ చేయండి.