RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే

  • రైల్వేలో 6,557 ఉద్యోగాలు
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది
  • జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Rrb Technician Recruitment

Rrb Technician Recruitment

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. RRB Technician Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. పదో తరగతి, డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని పోస్టులు?

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 6,557 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ – 323 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్-III – 6,234 పోస్టులు.

విద్యార్హతలు

పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమాన అర్హత ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI / ఇతర నిర్దేశిత సాంకేతిక అర్హతలు ఉండాలి. (పూర్తి అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.)

వయోపరిమితి

టెక్నీషియన్ గ్రేడ్-I: 18 నుంచి 33 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్-III: 18 నుంచి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు. ఇతర కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభం: జూన్ 30, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 31, 2026
దరఖాస్తు సవరణలు: ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10, 2026

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.

జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం చెల్లిస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-I: నెలకు రూ.29,200.టెక్నీషియన్ గ్రేడ్-III: నెలకు రూ.19,900. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రావెల్ అలవెన్స్ తదితర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి.