Site icon NTV Telugu

RBI Jobs: ఆర్బీఐలో ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Rbi Jobs Latest

Rbi Jobs Latest

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బ్యాంకులో ఖాళీలు ఉన్న పోస్టుల కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబాయి లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానం లో 37 కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్, ఎనలిస్ట్‌ పోస్ట్స్ వున్నాయి.. అర్హులు అప్లై చేయవచ్చు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీపీఎం/ పీజీడీఎం ని పూర్తి చేసి ఉంటే ఈ పోస్టు లకి దరఖాస్తు చేయవచ్చు. అదే విధంగా ఉత్తీర్ణత తో పాటు నోటిఫికేషన్‌ లో సూచించిన విధంగా పని అనుభవం కూడా తప్పని సరి. అదే వయస్సు వివరాలు చూస్తే 23 నుంచి 40 ఏళ్ల మధ్య లో వయస్సు ఉండాలి.. వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..

ఇక పోస్టుల వివరాలు.. ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 6, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల సంఖ్య: 3, డేటా అనలిస్ట్ (అప్లైడ్ ఎకనామెట్రిక్స్) పోస్టుల సంఖ్య: 2, ఎకనామిస్ట్ (మాక్రో-ఎకనామిక్ మోడలింగ్) పోస్టుల సంఖ్య: 1, డేటా అనలిస్ట్ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) పోస్టుల సంఖ్య: 1 ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 8. మొదలైన పోస్టులు వున్నాయి. పూర్తి వివరాల ని https://www.rbi.org.in/ లో చూడవచ్చు.. దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేస్తే జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ వాళ్ళు రూ. 600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 100 అప్లికేషన్ ఫీజు కింద కట్టాల్సి వుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.. ఆసక్తి, అర్హతలు కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి..

Exit mobile version