Site icon NTV Telugu

Railway Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..2409 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

Ralway Jobs

Ralway Jobs

నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. రైల్వే లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది..సెంట్రల్ రైల్వే పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29 నుంచి ప్రారంభం అయ్యాయి.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ… ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి లేకపోతే దరఖాస్తుతిరస్కరించబడుతుందని తెలిపారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్న వివరాలు..

సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ యొక్క ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 2409 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, షోలాపూర్ క్లస్టర్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. వివరాలను తెలుసుకోవడానికి అలాగే అప్లై చేసుకోవడానికి సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను rrcr.com సందర్శించవచ్చు..

ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే.. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా కూడా కలిగి ఉండాలి.. 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 29 ఆగస్టు 2023 నుండి లెక్కించబడుతుంది.. ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి, జనరల్, OBC మరియు EWS కేటగిరీల అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎంపిక కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు.. అలాగే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,000 స్టైఫండ్‌గా ఇస్తారు.. అభ్యర్థుల నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు..

Exit mobile version