NTV Telugu Site icon

Bank of Maharashtra Recruitment 2025: బీటెక్ పాసయ్యారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ జాబ్స్ మీకోసమే

Bank

Bank

బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్కేల్-II, III, IV, V, VI, VIIలలో పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో భర్తీచేస్తారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల కోసం పోటీపడే వారు పోస్టులను అనుసరించి బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 22 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు. ఈ నియామకాలు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

ఇందులో అర్హత సాధించేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు రూ.1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు రూ.118 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

నెలవారీ జీతం:
1 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ VII 156500 – 4340/4 – 173860
2 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ VI 140500 – 4000/4 – 156500
3 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ V 120940 – 3360/2 – 127660 – 3680/2 – 135020
4 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ IV 102300 – 2980/4 – 114220 – 3360/2 – 120940
5 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ III 85920 – 2680/5 – 99320 – 2980/2 – 105280
6 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ II 64820 – 2340/1 – 67160 – 2680/10 – 93960