Bank of Maharashtra Recruitment 2025: బీటెక్ పాసయ్యారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ జాబ్స్ మీకోసమే
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ పోస్టులు
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 17
- ఇంటర్య్వూ ద్వారా ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్కేల్-II, III, IV, V, VI, VIIలలో పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో భర్తీచేస్తారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల కోసం పోటీపడే వారు పోస్టులను అనుసరించి బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 22 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు. ఈ నియామకాలు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
Also Read
ఇందులో అర్హత సాధించేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు రూ.1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు రూ.118 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
నెలవారీ జీతం:
1 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ VII 156500 – 4340/4 – 173860
2 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ VI 140500 – 4000/4 – 156500
3 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ V 120940 – 3360/2 – 127660 – 3680/2 – 135020
4 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ IV 102300 – 2980/4 – 114220 – 3360/2 – 120940
5 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ III 85920 – 2680/5 – 99320 – 2980/2 – 105280
6 స్కేల్ ఆఫ్ పే : స్కేల్ II 64820 – 2340/1 – 67160 – 2680/10 – 93960
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!