Site icon NTV Telugu

NCERT jobs 2024: NCERTలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే ?

Job Vacancy

Job Vacancy

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబందించిన అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు.. జీతం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ మే 10. ఈ పోస్టులపై ఉద్యోగాలు పొందాలనుకునేవారు అధికార వెబ్ సైట్ ను చూసి అప్లై చేసుకోవచ్చు..

మొత్తం పోస్టుల వివరాలు..

అకడమిక్ కన్సల్టెంట్- 03 పోస్టులు

ట్రాన్స్ లేటర్- 23 పోస్టులు

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 04 పోస్టులు

అర్హతలు..

ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలను కలిగి ఉండాలి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి..

వయసు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారికి 45 సంవత్సరాలు మించి ఉండకూడదు..

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఫలితాలు సిద్ధం చేయబడతాయి..

జీతం..

అకడమిక్ కన్సల్టెంట్- రూ 60000, ట్రాన్స్ లేటర్- రూ 30000 వరకు ఉంటుంది..

ఈ పోస్టులకు అప్లై చేసుకోవారు.. అధికారిక వెబ్‌సైట్..  ncert.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

Exit mobile version