Site icon NTV Telugu

JEE Main 2026 Results: అలర్ట్.. జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

Jee Mains Results

Jee Mains Results

JEE Main 2026 Results: విద్యార్థులకు అలర్ట్.. ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్‌కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని సైతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే పోర్టల్‌లో ఫలితాలు, మెరిట్ లిస్ట్ సైతం అందుబాటులో ఉన్నాయి. మీరు ఫలితాలను తెలుసుకోవాలంటే ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి.

READ MORE: జుట్టు రాలడానికి బై బై! ఈ సూపర్ ఫుడ్స్‌తో మీ జుట్టు 10 రెట్లు బలం.!

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ జేఈఈ మెయిన్ 2026 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మీ రా స్కోర్‌ను సైతం లెక్కించుకోవచ్చు. సరైన సమాధానానికి +4 మార్కులు వస్తాయి. తప్పు సమాధానానికి -1 మార్క్ కట్ అవుతుంది. న్యూమరికల్ ప్రశ్నల్లో కేవలం సరైన సమాధానాలకు మాత్రమే మార్కులు ఇస్తారు, తప్పు అయితే అక్కడ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫైనల్ కీలో డ్రాప్ చేసిన ప్రశ్న ఉంటే ఆ షిఫ్ట్ రాసిన అందరికీ పూర్తి మార్కులు ఇస్తారు.

READ MORE: Ragi Soup Recipe: బరువు తగ్గించే, 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ రాగి సూప్ రెసిపీ.. రాత్రి లైట్ మీల్‌కు బెస్ట్!

కాగా.. ఈ పరీక్షను జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వహించారు. ఈసారి అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో మొత్తం తొమ్మిది ప్రశ్నలను తొలగించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇలా తొలగించిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు అందరికీ ఇచ్చేలా నిబంధనలు అమలు చేశారు. ఈ మార్పులన్నీ పరిగణనలోకి తీసుకుని ఫైనల్ స్కోర్, పర్సెంటైల్ లెక్కించబడుతుంది.

Exit mobile version