Site icon NTV Telugu

ITI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తు చేసుకోండి మరీ!

Iti Recruitment

Iti Recruitment

ITI Recruitment: నిరుద్యోగులకు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) గుడ్ న్యూస్ చెప్పింది. యువ నిపుణుల కోసం ITI తాజాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్‌లో వివిధ స్థానాలకు మొత్తం 215 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత జీతం, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనలో ప్రజలు..!

గ్రాడ్యుయేట్ : ఈ పోస్ట్‌లో క్రియాత్మక విభాగాల ప్రాజెక్టులు, ప్రాజెక్ట్ నిర్వహణ, సమాచార వ్యవస్థలు, సాంకేతికత, ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగాలు మొదలైన ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ఐటీఐ పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు, ఉద్యోగానికి ఎంపిక అయితే నెలకు జీతం రూ.60 వేలు వస్తాయి.

టెక్నీషియన్ : ఈ పోస్ట్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగాలు క్రియాత్మక రంగాలు ప్రాజెక్టులు, సమాచార వ్యవస్థలు, సాంకేతికత, తదితర రంగాలు వస్తాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35 వేలు జీతం వస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకోడానికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు.

ఆపరేటర్ : ఈ పోస్ట్ పరిధిలోకి వచ్చే క్రియాత్మక విభాగాలు ప్రాజెక్టులు, కంప్యూటర్ సంబంధిత విభాగాలు, ఉత్పత్తి, తయారీ మొదలైనవి. ఈ పోస్ట్‌కు నెలకు వచ్చే జీతం రూ.30 వేలు. దీనికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. ఇందులో దరఖాస్తు దారులందరూ కచ్చితంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ఒక ఏడాదికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగం. దీనిని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి పనితీరు ఆధారంగా పొడిగించవచ్చు, కానీ ఎంత పొడిగించిన రెండు సంవత్సరాల కంటే ఎక్కువ పొడగించారు.

ఎలా దరఖాస్తు చేయాలంటే..
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి, ఐటీఐ అధికారిక వెబ్‌సైట్ itiltd.in ని సందర్శించండి. అక్కడ మీకు నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ కనిపిస్తాయి. దరఖాస్తు చేసుకునే ముందు దయచేసి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మాత్రమే ఫారమ్‌ను పూర్తి చేయండి.

READ ALSO: Bandi Sanjay : తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం

Exit mobile version