Site icon NTV Telugu

Google Internship 2026: గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే గోల్డెన్ ఛాన్స్.. స్టైఫండ్ ఎంతో తెలుసా!

Google Internship 2026

Google Internship 2026

Google Internship 2026: గూగుల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారా.. ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్. 2026 కోసం గూగుల్ వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), PhD విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్‌తో పాటు స్టైపెండ్‌ను కూడా ఇస్తున్నారు. గూగుల్ ఏయే ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానించిందో, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎంపికైన అభ్యర్థులకు ఎక్కడ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Sheikh Hasina: “బంగ్లాదేశ్ జైలు, ఉరిశిక్షలకు స్థలంగా మారింది”.. యూనస్‌పై విరుచుకుపడిన హసీనా..

ఈ నగరాల్లో Googleతో కలిసి పనిచేసే ఛాన్స్..
గూగుల్ వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇవి యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు ఎంపికైన అభ్యర్థులు కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పూణే, తెలంగాణలోని హైదరాబాద్‌లలో గూగుల్‌తో పనిచేసే అవకాశం ఉంటుంది.

స్టూడెంట్ రీసెర్చర్ 2026: గూగుల్ స్టూడెంట్ రీసెర్చర్ 2026 ప్రోగ్రామ్ కోసం గూగుల్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఎకనామిక్స్ లేదా నేచురల్ సైన్సెస్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు గూగుల్‌లో పరిశోధన, ఇంజినీరింగ్, సైన్స్ టీమ్‌లలో పనిచేసే అవకాశం ఉంటుందని సమాచారం.

సిలికాన్ ఇంజనీరింగ్ ఇంటర్న్, పీహెచ్‌డీ 2026: ఈ గూగుల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోడానికి పీహెచ్‌డీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో పీహెచ్‌డీలో వారి పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు గూగుల్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పీహెచ్‌డీ ఇంటర్న్, 2026: ఈ గూగుల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా ఇతర సాంకేతిక రంగాలలో పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారు కంప్యూటర్ సైన్స్ సొల్యూషన్స్‌పై పని చేయడానికి, స్కేలబుల్, డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

READ ALSO: Rakasa Glimpse: ‘ఆ వీరుడిని నేనే’.. అంటున్న సంగీత్ శోభన్! అసలు మ్యాటర్ ఇదే..

Exit mobile version