Site icon NTV Telugu

NSPG Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.15 వేలు మీ అకౌంట్‌లోకే.. అస్సలు వదులుకోవద్దు!

Pg Scholarship I

Pg Scholarship I

NSPG Scholarship: కేంద్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ను ప్రారంభించింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆలోచిస్తుంటే, ఫీజులు, బోర్డింగ్ లేదా పుస్తకాల కొనుగోలు గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్కాలర్‌షిప్ మీకు విశేషంగా ఉపయోగపడుతుంది. దీని కింద మీకు ప్రతి నెలా రూ.15 వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ స్కాలర్‌షిప్ డబ్బులు మీకు రెండు సంవత్సరాలు వస్తాయి. ఈ స్కాలర్‌షిప్‌ను నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనే పేరుతో పిలుస్తారు. దీని ఉద్దేశం.. ఆర్థిక పరిమితుల కారణంగా చదువును కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు సహాయం చేయడం. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బెయిల్‌.. అయినా జైలులోనే..!

NSPG స్కాలర్‌షిప్ అంటే..
ఈ స్కాలర్‌షిప్ భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 10 వేల మంది పీజీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 10 నెలల పాటు నెలకు రూ.15 వేలు అందిస్తారు. అంటే సంవత్సరానికి సుమారు రూ.1.5 లక్షలు, రెండు సంవత్సరాలలో రూ.3 లక్షల వరకు అందుతుంది. ఈ డబ్బు నేరుగా విద్యార్థి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలో ప్రతీ నెల జమ అవుతుంది.

* మొదటిసారి పీజీ కోర్సు చేస్తున్న విద్యార్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే పీజీ పూర్తి చేసి ఉంటే, దీనికి అప్లై చేయడానికి మీరు అర్హులు కారు.

* విద్యార్థి గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్, పూర్తి సమయం పీజీ కోర్సులో ప్రవేశం పొందాలి.

* ఓపెన్, డిస్టెన్స్, పార్ట్ టైమ్ లేదా ప్రైవేట్ మోడ్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తించదు.

* పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందే సమయానికి విద్యార్థి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.

* UGC గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

* ఈ స్కాలర్‌షిప్‌లో ప్రభుత్వం 30% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది.

* ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆసక్తిగల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేద్దామని అనుకుంటే నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. UGC వెబ్‌సైట్‌లో ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ చేస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు, విద్యార్థులు తమ వివరాలను జాగ్రత్తగా నింపాలి. పేరు, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా IFSC కోడ్‌లో చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే.. మీ అప్లికేషన్ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీనికి అప్లై చేసే టైంలో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని పలువురు నిపుణులు సూచించారు.

READ ALSO: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!

Exit mobile version