Site icon NTV Telugu

DRDO Entry Test: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐవారికి 1901 ప్రభుత్వ ఉద్యోగాలు. డీఆర్‌డీఓ ఎంట్రీ టెస్ట్‌.

Drdo Entry Test

Drdo Entry Test

DRDO Entry Test: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)లో 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామకాలు ‘సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ ట్యాలెంట్‌ మేనేజ్‌మెంట్‌'(సీఈపీటీఏఎం: సెప్టమ్‌) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ మేరకు సెప్టమ్‌.. డీఆర్‌డీఓ ఎంట్రీ టెస్ట్‌ నిర్వహించనుంది. ముఖ్యంగా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తారు. ఒకటి.. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బీ(ఎస్‌టీఏ-బీ). రెండు.. టెక్నీషియన్‌-ఏ(టెక్‌-ఏ). సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ కొలువులు 1075 ఉండగా టెక్నీషియన్‌ ఉద్యోగాలు 826 ఉన్నాయి. మొత్తం 1901.

ముందుగా సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ కొలువుల వివరాలు చూద్దాం. వేతన శ్రేణి రూ.35,400-1,12,400. సైన్స్‌ డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా చేసినవాళ్లు అర్హులు. ఆటోమొబైల్‌, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మెటలర్జీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఎంఎల్‌టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్‌, ప్రింటింగ్‌ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్‌టైల్‌, జువాలజీ సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

Telangana State Public Sevice Commission: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాటలో యూపీఎస్సీ. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి శ్రీకారం

వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మినహాయింపు ఉంది. టయర్‌-1(సీబీటీ) స్క్రీనింగ్‌ టెస్ట్‌, టయర్‌-2(సీబీటీ) సెలక్షన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్‌-ఏ కొలువుల వివరాలకు వస్తే.. వేతన శ్రేణి రూ.19,900-63200. టెన్త్‌, ఐటీఐవారు అర్హులు. ఆటోమొబైల్‌, బుక్‌ బైండర్‌, కార్పెంటర్‌, సీఎన్‌సీ ఆపరేటర్‌, సీఓపీఏ, డ్రాట్స్‌మ్యాన్‌(మెకానికల్‌), డీటీపీ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, గ్రైండర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌(డీజిల్‌), మిల్‌రైట్‌ మెకానిక్‌, మోటర్‌ మెకానిక్‌, పెయింటర్‌, ఫొటోగ్రాఫర్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్‌ మెటల్‌ వర్కర్‌, టర్నర్‌, వెల్డర్‌ ట్రేడ్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వయసు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. టయర్‌-1(సీబీటీ)-సెలక్షన్‌ టెస్ట్‌, టయర్‌-2-ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. పూర్తి వివరాలకు ఇవాళ్టి డెక్కన్‌ క్రానికల్‌ న్యూస్‌ పేపర్‌, 03-09 ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌, https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. డీఆర్‌డీఓలో పనిచేసేందుకు, తద్వారా దేశ సేవ చేసేందుకు ఇదొక సువర్ణావకాశమని చెప్పొచ్చు.

Exit mobile version